తెరాసకు మునుగోడు ఎన్నిక గెలుపు ఇలా సులభం ?

VAMSI
తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెలలో కాంగ్రెస్ పార్టీకి మరియు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనితో మునుగోడు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది... కాబట్టి ఉప ఎన్నిక అనివార్యం అయింది. కానీ తెలంగాణ ఎన్నికల సంఘం నుండి మాత్రం దీని గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మరో అయిదు నెలలలో ఇక్కడ ఉప ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడుతుందట. అయితే "ఆలు లేదు సోలు లేదు అల్లుడి పేరు సోమలింగం.... " అన్న చందంగా తెలంగాణలోని రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలు ఏదో రేపో ఎల్లుండో అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
ముఖ్యంగా బీజేపీ చాలా చురుకుగా ఎన్నికలకు రెఢీ అవుతోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మరియు అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి అధికార పార్టీ తెరాస లు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. కాగా మునుగోడు లో కాంగ్రెస్ నుండి అభ్యర్థి గా నలుగురు పేర్లు వినబడిన విషయం తెలిసిందే. వాటిలో పాల్వాయి స్రవంతి, రవి కుమార్, కైలాష్ నేత మరియు కృష్ణ రెడ్డి లు ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించి మిగిలిన ముగ్గురినీ బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. కానీ ఇదే అంశం తెరాస కు లాభించేలా ఉంది.
ఈ ముగ్గురు టిక్కెట్ రాలేదనే అక్కసుతో ఏ క్షణం అయినా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉంది. అప్పుడు ముగ్గురికి సంబంధించిన ఓట్లు చీలిపోతాయి. అప్పుడు వీటిని కనుక ఆకట్టుకుంటే తెరాస గెలుపుకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఎలాగూ తెరాస కు మద్దతుగా సీపీఎం ఉంది.. పైగా నల్గొండ జిల్లాలో సిపీఎం కు ప్రజల్లో మంచి పేరుంది మరియు ఓటు బ్యాంక్ కూడా ఉంది. ఈ రెండూ కనుక సరిగ్గా వర్క్ అవుట్ చేసుకుంటే తెరాస విజయం  నల్లేరుపై నడకే అవుతోంది. మరి చూద్దాం కేసీఆర్ ఈ విషయం లో ఎటువంటి స్టెప్ తీసుకుంటారో?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: