ఎన్నికల సర్వేలు పార్టీ గెలుపును డిసైడ్ చేస్తాయా ?

VAMSI
సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే నామినేషన్ జరిగినప్పటి నుండి ఫలితాలు వెలువడే వరకు కూడా సర్వేల హడావిడి ఎక్కువగా ఉంటుంది.. ఎన్నికల ముందు వరకు ప్రి ఎగ్జిట్ పోల్ సర్వే అని, ఎన్నికల అనంతరం పోస్ట్ ఎక్జిట్ పోల్ సర్వే అంటూ ఎన్నికలలో పాల్గొన్న నాయకులకు చెమటలు పట్టిస్తుంటారు. అయితే అన్ని సార్లు సర్వే లు చెప్పిన విధంగా ఫలితాలు రావు అన్నది తెలిసిందే. అయితే తెలంగాణ లోని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని కారణాలతో ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాడు.. దీనితో అక్కడ ఉప ఎన్నిక ఖరారు అయింది.
ఈ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని సిట్టింగ్ పార్టీ కాంగ్రెస్, అధికార పార్టీ తెరాస మరియు మధ్యలో ఉప ఎన్నికలలో గెలుస్తూ వస్తున్న బీజేపీ లు తమ ప్రణాళికలు రచించికుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే ప్రచారాల హోరు ఎక్కువ అవుతోంది. కాగా ఈ ఎన్నికపై సర్వేలు కూడా వాడి వేడిగా ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీ మాత్రం తమ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పక ఈ ఎన్నికలలో విజయం సాధిస్తాడు అని విశ్వాసంతో ఉన్నారు. అయితే దీనికి సర్వేలు కూడా బీజేపీ ది విజయం అని చెబుతున్నాయని ఇటీవల బంది సంజయ్ చెప్పిన విషయం తెలిసిందే.
కానీ ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్న విషయం ఒక్కటే... సర్వేలు అన్నీ కూడా రాజకీయ పార్టీలు మరియు అధికార ఒత్తిడుల వలన జరిగేవని అందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మా పార్టీ నే గెలుస్తుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది చర్చనీయంశం అవుతోంది. మరి చూద్దాం సర్వేల ప్రభావం పార్టీ లపై మరియు ఓటర్లపై ఎలా ఉండనుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: