గోదావరి : టీడీపీ కడుపుమంట బయటపడిందా ?

Vijaya



తెలుగుదేశంపార్టీ తప్పుచేసిందనే భావన మెజారిటి జనాల్లో వినబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాకినాడ జిల్లాలోని తొండంగి మండలంలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పార్క్ ఏర్పాటు వల్ల ఏడాదికి సుమారు రు. 7 వేల కోట్ల ఉత్పత్తులు జరుగుతాయని, 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఇదే విషయమై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తు కేంద్ర రశాయనాలు, ఎరువుల శాఖకు లేఖరాశారు. దీంతో టీడీపీ కడుపుమంటేమిటో బయటపడింది.





బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ వల్ల వాయుకాలుష్యం పెరిగిపోయి భూ, సముద్ర రవాణాకు తీరని నష్టం జరుగుతుందన్నారు. 50 వేలమంది స్ధానికులకు ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. వేలాది ఎకరాల వ్యవసాయ భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయని యనమల తన లేఖలో చెప్పారు. సమస్యను గుర్తించి బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్ణయాన్ని మానుకోవాలని లేఖలో డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.





ఇక్కడే యనమల కడుపుమంట బయటపడింది. ఫార్మా పార్క్ ఏర్పాటువల్ల నష్టాలుంటే దానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించుంటే బాగుండేది. ఏ ఇండస్ట్రీ పెట్టినా దానివల్ల ఎంతోకొంత ఇబ్బందులు తప్పవు. అందువల్ల అసలు సదరు ఫ్యాక్టరీయే వద్దని, కంపెనీనే ఏర్పాటు చేయకూడదని చెప్పటం తప్పు. ఫార్మా పార్క్ ఏర్పాటువల్ల నష్టాలు వస్తాయని అనుకుంటే అందుకు ప్రత్యామ్నాయాలను యనమల సూచిస్తే బాగుండేది. అంతేకానీ అసలు పార్కు నిర్మాణమే వద్దని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.






ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి వల్ల పరిశ్రమలు రావటంలేదని, ఉన్నపరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని టీడీపీ గోలచేస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఏర్పాటవుతున్న బల్క్ డ్రగ్ పరిశ్రమ వద్దని గోల మొదలుపెట్టింది. చూడబోతే ఏపీకి బారీ పరిశ్రమలు రావటం టీడీపీకి ఇష్టంలేదన్న విషయం అర్ధమవుతోంది. ఇక్కడే మెజారిటి జనాల్లో టీడీపీ తప్పుచేస్తోందనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. చివరకు సొంతజిల్లాకు పరిశ్రమ రావటం కూడా యనమలకు ఇష్టంలేకపోతే ఏమిచేస్తాం ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: