ఏపీ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..

Deekshitha Reddy
ఏపీ వాసులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల జగనన్న కాలనీలపై సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణం స్పీడప్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం. ఆ తర్వాత విదేశీ విద్యా దీవెన సదుపాయాన్ని కూడా కొనసాగించేందుకు నిర్ణయించారు. తాజాగా ఆరోగ్యశ్రీ పథకంలో అందించే చికిత్సల జాబితాను పెంచే విధంగా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు 2446 చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. త్వరలో వీటి సంఖ్య భారీగా పెరగబోతోంది. అయితే ఏయే చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తారు, వేటికి చికిత్స అందిస్తారు అనే విషయంపై కసరత్తు జరుగుతోంది. లిస్ట్ మాత్రం భారీగానే ఉంటుందని చతెలుస్తోంది. ఆగస్ట్-1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
ఏపీలో ఫ్యామిలీ డాక్టర్..
ఇప్పటికే కొన్ని ఇళ్లకు ఓ వాలంటీర్ ని పెట్టి ఫ్యామిలీ వాలంటీర్ అనే కాన్సెప్ట్ తెచ్చారు. ఇప్పుడు అదే రీతిలో ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఆగస్ట్- 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ని అమలు చేస్తామంటున్నారు అధికారులు. విలేజ్‌ క్లినిక్స్‌, పీ.హెచ్‌.సీ లకు డిజిటల్‌ వీడియో సదుపాయం కూడా కల్పించాలని సూచించారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీ కింద డబ్బు రోగి వర్చువల్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అక్కడినుంచి అది ఆస్పత్రి ఖాతాకు వెళ్తుంది. ఆస్పత్రిలో రోగి చేరేముందు కన్సెంట్ ఫామ్ తీసుకుంటారు. చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో ధృవీకరణ పత్రం ఇస్తారు.
కరోనా పరిస్థితి ఏంటంటే..?
ఈమధ్య అక్కడక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం కరోనా కేసుల్లో పెరుగుదల లేదని అంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కేలు విషయంపై సీఎం జగన్ ఆరోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, కేసుల సంఖ్య అక్కడక్కడ కనిపిస్తున్నా, ఎవరూ ఆస్పత్రికి వచ్చేంత అనారోగ్యానికి గురికావడంలేదని, సాధారణ జలుబు లాగానే కరోనా మారిపోయినట్టు తెలిపారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో 69 మంది మాత్రమే కరోనాతో ఆస్పత్రుల్లో ఉన్నట్టు తెలిపారు. వీరంతా కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. ప్రికాషనరీ డోస్ విషయంలో కూడా ఏపీ ముందు ఉంది. ఏపీలో ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషనరీ డోసు అందించారు. 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్‌ డోసు ఇచ్చే ప్రక్రియను స్పీడప్ చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు సీఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: