భారీ వర్షం.. పదేళ్లలో ఇదే రికార్డు?

praveen
గత కొంత కాలం నుంచి తెలుగు రాష్ట్రాలలో ఎంతలా కుండపోత వర్షాలు కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు  . వర్షాల కారణంగా వచ్చిన వరదల తో ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధం లో మునిగి పోతున్నాయ్ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది జనాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాగా తెలుగు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరెంజ్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.

 అయితే మొదట పంటలు వేసుకునేందుకు వర్షాలు కురుస్తున్నాయి అని సంతోషపడిన రైతులందరూ కూడా ఇక ఇప్పుడు అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం  మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.  ఈ క్రమంలోనే రోజురోజుకి ఇక భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో అధ్వానంగా మారిపోతుంది అని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీగా కురుస్తున్నాయ్. వర్షాల నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు అటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 ఇక రాష్ట్రం లో నేడు రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినట్లు తెలుస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో 61 సెంటీ మీటర్ల వర్షం పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆసిఫాబాద్, జయ శంకర్, రాజన్న, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే నిన్న కాలేశ్వరం లో 35  సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత పదేళ్ళలో జూలై నెలలో ఇదే అత్యధిక రికార్డు అని చెప్పాలి. అంతే కాదు రాష్ట్రంలోని పలుచోట్ల 20 సెంటీమీటర్ల వర్షం పడినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: