ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలెర్ట్..

Satvika
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఒకవైపు నైరుతి రుతుపవనాలు.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాల కారణంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా ఎందరో రోడ్డున పడ్డారు. ఇప్పుడు అంతకు మించిన రేంజ్ లో అల్ప పీడనం ఏర్పడింది.
ఏపీలో వర్షాకాలం భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల సంస్థ ముందస్తు అప్రమత్తం అయింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విపత్తుల సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.
జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించించారు. మీ ప్రాంతంలో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు కింద పేర్కొన్నారు.1070, 18004250101, 08632377118..
శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.ఏపీలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో ముసురు వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు బయట ఎక్కువగా తిరగొద్దని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: