ఏపీలో ఘనంగా మట్టి ఎద్దుల వేడుకలు..

Satvika
రైతన్నలకు , ఎద్దులకు మంచి సంబంధం వుంటుంది..రైతుకు నాలుగు వేళ్ళు నోటిలోకి వెల్థున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు.. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు.కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఏరువాక పౌర్ణమి, బసవ జయంతి పర్వదినాలను నిర్వహిస్తారు.కన్నడ రాష్ట్రం నుంచి ఈ పండుగ మన రాష్ట్రానికి వచ్చింది.కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం లో మట్టి ఎద్దుల పండుగ అమోఘం. మట్టి బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి. వర్షాలు బాగా కురుస్తాయి. రైతులు ఆరోగ్యాలు కూడ బాగుంటుందని నమ్మకం. అప్పట్లో ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ నియోజకవర్గాలు కర్నాటక బళ్లారి జిల్లాలో ఉండేవి. ఆనవాయితీగా ఈ పండుగలు చేస్తున్నాము.

కర్ణాటక నుంచి సంక్రమించిన పండగ. 150 గ్రామాల్లో మట్టి ఎద్దుల అమావాస్య సంప్రదాయం. మట్టి విగ్రహాల మాటున ప్రగాఢ విశ్వాసం. రెండు రోజులుగా కొనసాగిన పర్వదినం పర్వదినం. ఏరువాక పౌర్ణమి తరువాత వచ్చే అమావాస్యనే ఇక్కడ మట్టి మంటి ఎద్దుల అమావాస్య. వానలు కురవడం, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది.పిండి వంటలు,  మంచిగా పూజలు చేస్తారు.


మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకెళ్లి ఇళ్లలో దూలాలు, పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు శివాలయంలో వదిలి వెళ్ళిన ఎద్దులను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాల్లోను కొలువు చేస్తారు.
ఈ మట్టి ఎద్దుల తయారి లో కాలుష్యం ఉండదు.మట్టి విగ్రహాల కళాకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది .వేలల్లో మట్టి ఎద్దుల విగ్రహాలను అమావాస్య రోజున విక్రయిస్తారు. కుమ్మరి వృత్తి కళాకారులు ఎక్కువగా ఈ మట్టి విగ్రహాలను తయారు చేస్తారు. కౌతాళం, ఆదోని, ఆలూరు, కోసిగి, ఈ ప్రాంతాల్లో కళాకారులు ఉన్నారు..ఎంతో మంది విగ్రహాలను తయారు  చేస్తారు..మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: