కోస్తా : మోడీ అంటే జనాల్లో ఇంత మంటుందా ?

Vijayaనరేంద్రమోడి అంటే ఏపీ జనాల్లో ఎంతమంటుందో తాజాగా బయటపడింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో గెలిచిన వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లొస్తే బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ కు వచ్చిన ఓట్లు 19, 352 మాత్రమే. మేకపాటికి మెజారిటి 82 వేలు వస్తే భరత్ కుమార్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. దీనిబట్టే మోడి సర్కార్ అంటే ఏపీ జనాల్లో ఎంతగా మండుతున్నారో అర్ధమైపోతోంది.
2014-19లో మోడి సర్కార్ ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటిని కూడా రానివ్వలేదు. దాంతో 2019 ఎన్నికల్లో పోటీచేసిన కమలం అభ్యర్ధులకు కనీసం ఒక్కసీటులో కూడా డిపాజిట్ రాలేదు. సరే అప్పుడంటే ఏదో అలా జరిగిపోయిందని అనుకుంటే తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా అదేవరస. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో పోటీచేస్తే డిపాజిట్ గల్లంతు.
ఆ తర్వాత కడప జిల్లా బద్వేలు అసెంబ్లీకి ఉపఎన్నిక జరిగింది. అప్పుడు కూడా బీజేపీ అభ్యర్ధికి డిపాజిట్ రాలేదు. ఇపుడు ఆత్మకూరు ఉపఎన్నికలో కూడా సేమ్ టు సేమ్. అంటే ఒక సాధారణ ఎన్నికతో కలుపుకుని మూడు ఉపఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్లు రాలేదు. అసలు ఏ ఎన్నికలోను కనీసం పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని స్ధితిలో ఉంది కమలంపార్టీ. ఇలాంటి పార్టీ కూడా 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అంటు పదే పదే సొల్లు కబుర్లు చెబుతోంది.
అసలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను పోటీకి గట్టి అభ్యర్ధులను నిలబెట్టగలిగితే చాలు అదే గెలిచినంత. ఇంతోటిపార్టీ కూడా మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించటానికి ఏమాత్రం అంగీకరించటంలేదు. అంటే తమపై తమకు విపరీతమైన నమ్మకంతో ఉన్నట్లున్నారు. కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్సుంటేనే సమస్యంతా. ఇపుడు కమలనాదులు ఏ స్టేజిలో ఉన్నారో వాళ్ళే విశ్లేషించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: