'జనసేన' లోకి టాలీవుడ్ హీరో నందు ?

VAMSI
సింగర్ గీతామాధురి భర్త మరియు నటుడు నందు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇక వీరిద్దరూ తమ కూతురితో కలిసి చేసే వీడియోలు బాగా హైలెట్ గా ఉంటాయి. తమ వ్యక్తిగత లైఫ్ కి సంబంధించిన విషయాలే కాకుండా ఫ్యామిలీ ఫోటో లను కూడా బాగా షేర్ చేసుకుంటారు. ఫోటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయిన హీరో నందు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్ర హీరో.
హీరోగా మాత్రమే చేస్తాను అని కూర్చోకుండా పాత్ర నచ్చితే చాలు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ ప్రేక్షకులను అలరించే అతి తక్కువ మంది హీరోల్లో ఇతడు కూడా ఒకడు. కాగా ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే నటుడు నందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే.  అంతేకాదు పవన్ కళ్యాణ్ గురించి సంబందించిన పలు విషయాలను గురించి తన సోషల్ మీడియాలో చర్చలు చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా తన సోషల్ మీడియాలో నందు ఒక పోస్ట్ షేర్ చేయగా.. అందులో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక కామెంట్ పెట్టాడు.
ప్రజలతోనే పొత్తు అంటూ.. ప్రజా పుత్రుడు అంటూ హాట్ హాట్ గా ఉన్న టీ కప్పు మీద జనసేన సింబల్ తో ఫోటో షేర్ చేశాడు. ఇక ఆ ఫోటో కాస్త ఇపుడు ఫుల్ గా వైరల్ అవుతోంది. అందులోనూ పవన్ అభిమానులు సో హ్యాపీ అంటూ కామెంట్లు పెడుతూ జోష్ చూపెడుతున్నారు. అయితే ఈ సారి ఎన్నికల కోసం అందరూ పవన్ కు మద్దతుగా ఉంటూ మీడియాలో ప్రచారం చూస్తున్నారు. కొద్ది రోజుల క్రిందటే నటుడు సమీర్ కాబోయే సీఎం పవన్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తాజాగా నందు జనసేన పార్టీని ప్రమోషన్ చేస్తుండడంతో ఇది హాట్ టాపిక్ అయింది. ఇతను కూడా జనసేన పార్టీలో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: