రాష్ట్రంలో భారీగా వర్షాలు..ఆ జిల్లాల్లో అధిక వర్షం..

Satvika
దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే..దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..నార్త్‌ సైడ్ రాష్ట్రాలు భారీ వర్షాల కారణంగా అతాలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలకు వరదలు పోటేత్తి రావడం తో చాలా మంది మృత్యు వాత పడ్డారు..పలు ప్రాంథాలు పూర్తిగా నీటమునిగాయి..తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి వానలు దంచికొట్టాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది..

అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 12.9 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో 12.5 సెంటీమీటర్లు, సుల్తాన్‌పూర్‌లో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డిలో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, ఆదిలాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కిష్టారెడ్డిపేటలో 12.5 సెంటీమీటర్లు, సుల్తాన్‌పూర్‌లో 12.3 సెంటీమీటర్లు, కుమ్రంభీం గిన్నెదరిలో 11.4, కరీంనగర్‌ చిగురుమామిడిలో 14, హనుమకొండ జిల్లా వేలార్‌లో 12, వరంగల్‌ జిల్లా మంగళవారిపేటలో 11.3, మంచిర్యాల జిల్లా శాంతాపూర్‌లో 10.7, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 10.7, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 10.4, భద్రాద్రి కొత్తగూడెం కర్కగూడెంలో 10.3, సంగారెడ్డి జిల్లా కందిలో 10.2, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనాలో 10.8, నిజామాబాద్‌ జిల్లా మాచెర్లలో 10.2, సంగారెడ్డి జిల్లాలో రుద్రారంలో 10.2, రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 10.2, జనగామ జిల్లా మల్కాపూర్‌లో 10.1, కరీంనగర్‌ జిల్లా వెంకెపల్లిలో 10.1, జనగామ జిల్లా తాటికొండలో 10 సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది..

నేడు పలు జిల్లాల్లొ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా ఉండడంతో ఈ నెల 24 వరకు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది..ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: