రోడ్డుపై పడుకున్న హెడ్మాస్టర్.. షాకైనా స్టూడెంట్స్.. ఏం జరిగిందంటే?

praveen
మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా అస్తవ్యస్తంగా మారిపోయిన విద్యా వ్యవస్థ మొత్తం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో అనుకున్న సమయానికి విద్యా సంస్థలు తెరుచుకోవడమే కాదు అటు విద్యార్థులు కూడా తరలి వెళ్తున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక స్కూళ్లు కూడా తెరుచుకున్న నేపథ్యంలో ప్రస్తుతం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే రోజురోజుకీ అటు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ నేపథ్యంలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి.

 ఈ క్రమంలోనే బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని అంటూ నినాదాలు చేస్తూ స్కూల్ లోని ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులతో కలిసి గ్రామాల్లోని అన్ని వీధుల్లో తిరుగుతూ తల్లిదండ్రులను సంప్రదిస్తూ తమ పిల్లలను బడికి పంపించాలని కోరుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా బడిబాట కార్యక్రమంలో కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు అనే చెప్పాలి. ఇక్కడ ఓ ప్రధానోపాధ్యాయుడు ఇలాంటిదే చేశాడు. విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు సరికొత్తగా  నిరసన తెలిపాడు. ఎర్రటి ఎండలో విద్యార్థుల ఇంటి ముందు రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపాడు.

 సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఆసక్తికర సన్నివేశం గ్రామస్తులందరినీ కూడా ఆలోచింపజేసింది అని చెప్పాలి. గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 175 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక వీరిలో వివిధ తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి కూడా హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ రావ్ ఇక విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఇళ్ల ఎదుట పడుకుని నిరసన తెలుపుతూ స్కూల్ కు పంపించాలని తల్లిదండ్రులను కోరాడు. స్పందించిన  తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: