"కేసీఆర్ - ప్రశాంత్ కిషోర్"లు కలిసినా అధికారం నిలబెట్టుకోవడం కష్టమే ?

VAMSI
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చ వాడివేడిగా సాగుతోంది. అధికార పార్టీ తెరాస కు చెమటలు పడుతున్నాయి. ఈ మధ్యనే తెలంగాణ రాజకీయ పరిస్థితుల మీద సర్వే చేయించిన ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ వాస్తవాలను తెరాస అధినేత కేసీఆర్ కు తెలియచేశారు. ఇక అప్పటి నుండి కేసీఆర్ కు ఎన్నికల గురించి కనగారు మొదలైంది. ఇప్పటికే నాలుగు వైపులా నుండి బీజేపీ, కాంగ్రెస్, షర్మిలక్క అవకాశం వస్తే కేసీఆర్ ను లాగేయాలని చూస్తున్న తరుణంలో సర్వే వాస్తవాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ప్రజల మద్దతును కోల్పోయారని తెలుస్తోంది.
అలా కొన్ని నియోజకవర్గాలలో వారికే ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓటమి పక్కా అని తెలుస్తోంది. అందుకే ఈ సారి ఓటమి చెందే అవకాశం ఉన్న స్థానాలలో కొత్త అభ్యర్థులను నిలబెట్టే ప్రణాళికలో ఉన్నారట. దీనికి సంబంధించిన పూర్తి హక్కులను కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ కి అప్పజెప్పారట. అయితే కొత్త అభ్యర్థులను నిలబెట్టినా గెలుపు దక్కడం దాదాపు అసాధ్యమేనని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు మభ్యపెడితే మోసపోయే వారు కాదని ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలకు అర్ధమయ్యే ఉంటుంది. అయితే ఈసారి ప్రశాంత్ కిషోర్ వారిపై ఎటువంటి వ్యూహాలను ప్రయోగించనున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.
అయితే రాజకీయ విశ్లేషకులు నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సారి కేసీఆర్ మరియు ప్రశాంత్ కిషోర్ లు కలిసి ఎన్ని ప్రణాళికలు చేసినా తెరాస గెలుపు కష్టమే అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. అయితే ప్రస్తుతం తెరాస పై ఉన్న కాస్త వ్యతిరేకత మిగిలిన పార్టీలకు ప్లస్ అవుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే  ఇవే ఓట్లను మూడు పార్టీలు పంచుకోవాలి... ఆ లెక్క చూస్తే సమీకరణాలు ఎలా మారనున్నాయో? మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: