అక్కడ టికెట్ లేకుండానే ఫ్లైట్ ఎక్కి ఆనందించవచ్చు!

Purushottham Vinay
నిడమానూరు గ్రామంలో ఫ్లైట్ డిన్నర్ కు మంచి ఆదరణ ఉంది. ఇక విమాన ప్రయాణం అంటే ఇష్టం ఉండని వారు ఉంటారా? అలా గాలిలో ప్రయాణిస్తూ ఆ మేఘాలను చూస్తూ ఉన్న అప్పుడు కలిగే అనుభూతిని అసలు మాటల్లో చెప్పలేం. ఇకపోతే విమానంలో విండో సీటు సొంతమైతే అసలు చెప్పలేని ఆనందం మన సొంతం అయినట్లే, ఇక మరికొంతమంది ఆకాశ వీధుల్లో విహరిస్తూ రుచికరమైన భోజనం చేయడానికి చాలా ఇష్టం అంటూ ఉంటారు.కానీ సామాన్యులకు విమానం ఎక్కడం అనేది ఒక మంచి కల లాంటిది. దాన్ని ఎప్పుడూ కూడా అందని ద్రాక్షగానే భావిస్తుంటారు.ఇక ఫ్లైట్ జర్నీనీ కలలో మాత్రమే ఊహించుకునే వారి కలలు ఇప్పుడు ఏకంగా నిజం చేసుకోవచ్చు. టికెట్ అనేది లేకుండానే ఫ్లైట్ ఎక్కి వెరైటీస్ ఆఫ్ ఫుడ్డును చాలా చక్కగా లాగించేయొచ్చు.అలాగే ఎయిర్ పోర్ట్ కు వెళ్లకుండా బోర్డింగ్ పాస్ తీసుకోకుండా ఫ్లైట్ ఎక్కేయవచ్చు కూడా.ఇక అదెలా సాధ్యం అనుకుంటున్నారా ఫ్లైట్ ఎక్కాలంటే గన్నవరం బస్ కావాల్సిందే, నిడమానూరు యూనియన్ పెట్రోల్ పంప్ పక్కన దీన్ని అందుబాటులో తీసుకొని వచ్చారు.


ఇక నాణ్యమైన భోజనం సరసమైన ధరలకే అందించటం మా లక్ష్యం అంటున్నారు ఈ రెస్టారెంట్ నిర్వాహకులు. ఇక ఈ రెస్టారెంట్లో తెలుగు రుచులు తో పాటు, వెజ్, నాన్ వెజ్ బిర్యానీ, సూప్స్ నార్త్ ఇండియన్ ఇంకా అలాగే చైనీస్ వంటకాలు స్వాగతం పలుకుతున్నాయి. ఎయిర్ హోస్టెర్స్ లేకపోయినా ఆప్యాయతతో భోజనం వడ్డించే సర్వర్లు ఇంకా విమానం గాల్లోకి ఎగిరిన పోయినా విమాన ప్రయాణ అనుభూతి పొందాలనుకునే వారికి ఇదే పర్ఫెక్ట్ స్పాట్ అని కూడా చెప్పవచ్చు.ఇక కేవలం రుచికరమైన భోజనం కొరకే కాకుండా ఈ విమానాన్ని చూసి ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ అనేక మంది కూడా వస్తుంటారు. ఇక వీకెండ్ వస్తే ఫ్యామిలీలు వచ్చి పిల్లలతో కలసి సందడి చేస్తున్నారు.ఇంకా ఆ నగరవాసులు విమానంతో సెల్ఫీలు తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: