అస్సాంలో వరదలు..పెరుగుతున్న మృతుల సంఖ్య..

Satvika
దేశంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..అకాల వర్షాల కారణంగా జనాలు అనేక ఇబ్బంధులను ఎదుర్కొంటున్నారు..దక్షిణ భారత దేశంలో కన్నా కూడా నార్త్ ఇండియా లో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అధిక శాతం వర్షం కురిసింది.దాంతో వరదలు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాల కారణం లక్షల మంది ఇల్లను కోల్పోయి రోడ్డు మీద పడ్డారు.. ముఖ్యంగా అస్సాంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది.


అనేక ప్రాంతాలలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. తాజాగా వరదల వల్ల ముగ్గురు మరణించారు.ఇప్పటి వరకూ వర్షం, వరదల కారణంగా 15 మంది చనిపోయినట్లు తాజా బులిటేన్ లో వెల్లడించారు.వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో పొరుగున ఉన్న త్రిపుర, మిజోరాం, మణిపూర్‌తో సహా అస్సాంలోని బరాక్ వ్యాలీ, దిమా హసావో జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో మంగళవారం రోడ్డు, రైలు కనెక్టివిటీ తెగిపోయింది. అస్సాం, మేఘాలయలో చాలా చోట్ల రోడ్డు, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. రెండు వందలకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.


సోమవారం వరకు 20 జిల్లాల్లో 1,97,248 మంది వరదల వల్ల ఇబ్బుందులు పడ్డారని అస్సాం అధికారులు తెలిపారు.. రైల్వే స్టేషన్‌ లోని రెండు రైళ్లు కూడా వరదనీటిలో మునిగిపోయాయి. మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ అస్సాంలోని బరాక్ వ్యాలీ, మూడు ఈశాన్య రాష్ట్రాలలోని ముఖ్యమైన ప్రాంతాల కు రహదారి కనెక్టివిటీకి అంతరాయం ఏర్పడింది. ఈస్ట్ జైంతియా హిల్స్ పోలీసులు తమ అధికార పరిధిలో తాజాగా కొండచరియలు విరిగిపడటంతో అప్రమత్తమయ్యారు. రోడ్డు, రైలు కనెక్టివిటీకి అంతరాయం కలగడంతో విమాన ఛార్జీలు పెరిగాయి. విమాన ప్రయాణ టిక్కెట్ల ధరల సమస్య ను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఆ ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: