నారాయణ అరెస్ట్‌.. మరి బొత్సనూ అరెస్ట్ చేస్తారా?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి నారాయణ అరెస్టపై టీడీపీ మండిపడుతోంది. ఈ విషయంలో అనేక లాజిక్కులు లాగుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మరో కొత్త లాజిక్‌ బయటకు తీశారు. ఏపీ లో పేపర్ లీక్ అయిందని మాజీ మంత్రి నారాయణ ను అరెస్ట్ చేశారు.. సరే.. ప్రజాస్వామ్యంలో కేసు పెట్టడం సర్వసాధారణమే... గత నెల 24న పేపర్ లీక్ అయితే ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.

లీకేజీ కేసులో నారాయణను అరెస్ట్ చేసినప్పుడు, బొత్స ను ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నిస్తున్నారు.  సిఐడి పోలీసులు ఏసీబీ కేసు నమోదు చేశారని..  దానిలో ముద్దాయులుగా చంద్రబాబు నాయుడు, నారాయణను పెట్టారని.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక రిపోర్ట్ ఇస్తే దాని పై వెంటనే పిర్యాదు తీసుకున్నారని.. సీఆర్డీఏలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు. నారాయణ టెర్రరిస్ట్, ఉగ్రవాది కాదు.. అలాగే  చంద్రబాబు పై కూడా ఏసిబి కేసులు పెట్టాలని చూశారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గుర్తు చేశారు.

టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఇంకా ఏమన్నారంటే.. ” ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. గిరిధర్ అనే వ్యక్తి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని నారాయణను అరెస్ట్ చేయడం ఏంటి? ఆధారాలు సేకరీంచాల్సిన అధికారులు, వేరే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఎలా అరెస్ట్ చేస్తారు. ఒక భయాందోళనకర వాతావరణంలో రిపోర్టులు సిద్దం చేస్తున్నారన్నారు.

నారాయణను కుమారుడి వర్ధంతి జరుగుతున్న సందర్భంలో అరెస్ట్ చేశారని.. చట్టం తన పని చేస్తోందని బొత్స అంటున్నారు..... చట్టం వైసీపీ నేతలకు చుట్టం గా పనిచేస్తుంది... వైసీపీ వైఫల్యాలను టీడీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఏపీలో గత 3 ఏళ్ల నుంచి అచ్చెన్నాయుడు సహా... అందరి పై కేసులు పెట్టారని.. జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని... జగన్ కు అనేక సార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా తీరు మారడం లేదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: