భారత్ లో షిగెల్లా బ్యాక్టీరియాతో తొలి మరణం.. హడలిపోతున్న జనం

Deekshitha Reddy
ఓవైపు కరోనా హడలెత్తిస్తోంది. కొత్త వేరియంట్లతో జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు టెన్షన్ పడుతున్నాయి. కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతుండటంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈలోగా షిగెల్లా బ్యాక్టీరియా అనేది కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేరళలో షిగెల్లా కారణంగా తొలి మరణం సంభవించింది. భారత్ లోనే అది తొలి మరణం కావడం విశేషం. 16 ఏళ్ల ఓ అమ్మాయి స్థానిక ఫుడ్ స్టాల్ వద్ద షవర్మా తినడం వల్ల ఆమెకు షిగెల్లా బ్యాక్టీరియా సోకిందనే అనుమానాలున్నాయి. అది తిన్న తర్వాత రెండు రోజులకే ఆ అమ్మాయి మరణించిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును కేరళ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టడం కూడా విశేషం.
షిగెల్లా బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులు అంటువ్యాధులు కావడంతో స్థానికులు భయపడుతున్నారు. విరేచనాలు, ఈ వ్యాధి లక్షణం. విసర్జన క్రియల తర్వాత చేతులు శుభ్రపరచుకోవడం చేయకపోతే ఈ బ్యాక్టీరియా సులభంగా వ్యాపిస్తుందని అంటున్నారు. షిగెల్లా బ్యాక్టీరియా సోకినట్టు అనుమానాలున్నవారికి యాంటీబయోటిక్స్ ఇస్తున్నారు వైద్య సిబ్బంది. దీంతో బ్యాక్టీరియా నాశనం అవుతుందని ఎలాంటి ఇబ్బందులు ఉండని చెబుతున్నారు.
షిగెల్లా బ్యాక్టీరియా సోకిన వారికి విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, జ్వరం, వంటి లక్షణాలుంటాయి. షిగెల్లా బ్యాక్టీరియా సాధారణంగా చిన్నపిల్లలలో కనిపిస్తుంది. మిగతా వారిలో లక్షణాలున్నా వారు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలుషిత నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశముంది. ఒక్కోసారి తీవ్రమైన జ్వరం కూడా వస్తుందని అంటున్నారు. ఈ బ్యాక్టీరియా తీవ్రమైతే అతిసార వ్యాధి కూడా ఉంటుందని అంటున్నారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలని వైద్య సిబ్బంది ప్రజలకు సూచిస్తున్నారు. మొత్తమ్మీద షిగెల్లా బ్యాక్టీరియా భారత్ లో కలకలం సృష్టిస్తోంది. అదే సమయంలో తొలి మరణం కూడా భయాందోళనలకు కారణం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: