రాహుల్ ఎపిసోడ్ కి కౌంటర్ గా భలే ఫొటో వదిలారుగా..?

Deekshitha Reddy
రాహుల్ గాందీ నేపాల్ పర్యటన.. భారత్ లో సంచలనం సృష్టిస్తోంది. నేపాల్ లో ఓ నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఈ దశలో బీజేపీకి చెందిన వీడియోలు, పాత ఫొటోలను కూడా కాంగ్రెస్ వెలికి తీస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ప్రకాష్ జవదేకర్ ఓ పార్టీలో పాల్గొన్న ఫొటో ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలనుంచి బయటకొచ్చింది. ఈ ఫొటోలో ఉన్న నేత ఎవరో కనిపెట్టండి అంటూ కాంగ్రెస్ నాయకుడు బీవీ శ్రీనివాస్ ప్రకాష్ జవదేకర్ పొటోని బహిర్గతం చేశారు.
ప్రైవేటు జీవితం ఉండకూడదా..?
కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ.. నైట్‌ క్లబ్‌ లకు వెళ్లడం ఏంటి.. అక్కడ అమ్మాయిలతో కలసి పార్టీల్లో పాల్గొనడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రాహుల్ వ్యక్తిగత పర్యటనలపై విమర్శలు చేయడం తప్పు అంటోంది కాంగ్రెస్. రాహుల్ గాంధీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేయడం సరికాదని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆ విషయంలో బీజేపీ నేతలంతా పత్తిత్తులా అని మండిపడుతున్నారు. నైట్ క్లబ్ కి వెళ్లినంత మాత్రాన రాజకీయాలకు పనికిరాకుండా పోతారా అని నిలదీస్తున్నారు.
ప్రధానిపై కౌంటర్లు..
రాహుల్ గాంధీ వ్యవహారం బయటకొచ్చిన తర్వాత కాంగ్రెస్ వివిధ రకాలుగా కౌంటర్లు రెడీ చేసుకుంటోంది. ప్రధాని మోదీ గతంలో పాకిస్తాన్ కు పిలవని వేడుకకు వెళ్లారని, నవాజ్‌ షరీఫ్‌ తో కలసి మోదీ కేక్ కట్ చేశారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ తన స్నేహితురాలైన జర్నలిస్ట్ వివాహానికి మాత్రమే హాజరయ్యారని బదులిస్తోంది. దీనిపై రాజకీయం చేయడం తగదని అంటున్నాకు కాంగ్రెస్ నాయకులు. స్నేహితులు, కుటుంబసభ్యుల వివాహాది శుభకార్యాలకు వెళ్లడం కూడా నేరంగా భావిస్తున్నారా అని ప్రస్నిస్తున్నారు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ దీప్‌ సూర్జేవాలా.
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా రాహుల్ రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాహుల్ అలాంటి వాడా అని బీజేపీ సెటైర్లు పేలుస్తుంటే.. మోదీ చేసిందేంటి అని కాంగ్రెస్ నేతలు బదులిస్తున్నారు. ఈలోగా మిగతా నాయకుల ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. ఇలా ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒకరి పరువు ఇంకొకరు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: