హైదరాబాద్‌లో ఆ ప్రాంతానికి కేసీఆర్‌ వెళ్లలేరా?

Chakravarthi Kalyan

కేసీఆర్‌ తెలంగాణ సీఎం. ఆయన మాటతో తెలంగాణ మొత్తాన్ని మాయ చేస్తారన్న పేరుంది. కానీ అలాంటి ఆయన తెలంగాణలో ఓ ప్రాంతానికి మాత్రం వెళ్లలేరని విపక్షాలు వెటకారం ఆడుతున్నాయి. ఆ ప్రాంతం కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అదే ఉస్మానియా యూనివర్శిటీ.. అవును.. కేసీఆర్ ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లగలరా అని సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.

ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. రాహుల్ పర్యటనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. ఓయూ కు రాహుల్ పర్మిషన్ కోసం వీసీకి పెట్టుకున్న విజ్ఞప్తి ని రద్దు చేశారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ కి ఇదేనా బహుమతి అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. కొందరు రాహుల్ పర్యటనపై కొందరు పనికిరాని వాళ్లు చెత్త మాటలు మాట్లాడుతున్నారని.. రాజకీయ నాయకులకు ఓయూలో అనుమతి లేదని తీర్మానం ఇప్పుడే బయట పెట్టడంలో మతలబేంటని ఆయన ప్రశ్నించారు.

సమైక్య రాష్ట్రంలో సైతం ఓయూలో లేని నిబంధనలు.. కోరి తెచ్చుకున్న తెలంగాణ లో నిబంధనలా.. సిగ్గుపడాలి అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఓయూకు ఎందుకు వెళ్లలేదని.. ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు... సీఎం ను ఓయూ తీసుకెళ్లలేకపోయారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. విద్యార్థుల కోపానికి భయపడే ఓయూకు వెళ్లడం లేదు.. ఓయూకు వెళ్లలేని పిరికిపందలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఓయూ రాహుల్ విజిట్ విషయంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

తెలంగాణ వచ్చాకే యూనివర్సిటీ లు వీసీ లేకుండా కొనసాగిందని.. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో మరెప్పుడూ లేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. విధిలేని పరిస్థితి లో ఈ మధ్యే వీసీలను వేశారని..  కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: