తెలంగాణలో తొలకరి చినుకులు..పులకరించిన జనం..

Satvika
అమ్మో..ఎండలు.. బాబోయ్ ఉక్కపోత..వామ్మో.. మండు వేసవి.. ఇలాంటి మాటలు వేసవిలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత ఏడాది తో పోలిస్తే ఎండలు ఈ యెడు కాస్త ముందుగానే వచ్చినట్లు తెలుస్తుంది. జనాలు వేసవి తాపానికి తట్టుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఉదయం 10 దాటితే భగభగ మండే సూర్యుడు తాపాని కి జనం బెంబెలెత్తి పోతూన్నారు. పెద్ద పెద్ద నగరాల్లో భానుడి ప్రతాపం కాస్త ఎక్కువగా ఉంది. రోజుకు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతూన్నాయని అధికారులు అంటున్నారు..


ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీవ్రమైన వేడికి ఉక్క పోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంకాలం ఒక్కసారిగా అనూహ్య మార్పు చోటు చేసుకున్నాయి. ఒక్కసారి గా మబ్బులు కమ్ముకొచ్చాయి. గాలి దుమారం తోడైంది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులు... తెలంగాణ మొత్తం నిన్నటి నుంచి కాస్త చల్ల బడింది. ఉక్కపోత తో తల్లడిల్లుతున్న పట్టణజీవికి కొంచెం ఉపశమనం లభించింది. పట్టణ వాసులు వర్షపు జల్లుల తో పులకరించారు. మండే ఎండల నుంచి కాస్తంత ఉపశమనం కలిగినట్లయింది.


మార్చి నెలలో వేసవిలో వరుణుడు దంచికొట్టాడు. గురువారం హైదరాబాద్‌ తో పాటు పలు జిల్లా ల్లో ఉరుములు మెరుపుల తో కూడిన వాన కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగింది. గురువారం సాయంత్రం వరకు ఎండలు దంచి కొట్టాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపొయింది.. ఆకాశం మబ్బులు కమ్మింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల తో కూడిన వర్షం పడింది.. నగర వాసులు వేడి నుంచి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు , మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.. మరో వైపు ఎండలు ఎక్కువుగా ఉన్నాయంటున్నారు. ఎండల నుంచి బయటపడటాని కి తగు జాగ్రత్తలు తీసుకొవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: