అమరావతి : ఇంతకీ పార్టీలో లోకేష్ స్ధాయి ఏమిటి ?
వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఓట్లేయించగలిగిన సీనియర్లకే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు తాజా మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పారన్నది అర్ధం కావటంలేదు. ఎందుకంటే యనమల రామకృష్ణుడు, బండారు సత్యనారాయణ, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కళా వెంకట్రావు లాంటి అనేకమంది సీనియర్లు పార్టీపై ఆధారపడ్డ వాళ్ళే. అంతేకానీ వీళ్ళవల్ల పార్టీకి జరిగిన లాభం ఏమీలేదనే టాక్ పార్టీలో ఎప్పటినుండో వినిపిస్తోంది.
తునిలో వరుసగా ఓడిపోతున్న యనమల కుటుంబం పార్టీకి గుదిబండలుగా మారారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. పార్టీ గాలుంటే ఇలాంటి వాళ్ళు గెలుస్తారంతే. అంతేకానీ ఏ పార్టీకి ఎలాంటి గాలి లేనపుడు కూడా యనమల లాంటి సీనియర్లు గెలవటంలేదు. సాధారణ ఎన్నికల్లోనే కాదు చివరకు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా చాలామంది సీనియర్ల నియోజకవర్గాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. అంటే చాలామంది సీనియర్లకు పార్టీవల్ల ఎలాంటి ఉపయోగం ఉండటంలేదనేది అర్ధమైపోయింది. పనిలో పనిగా లోకేష్ వల్ల ఎన్ని ఓట్లొస్తాయనే చర్చ కూడా మొదలైంది.
బహుశా చంద్రబాబు ఇలాంటి సీనియర్లను దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకు టికెట్ల ఇచ్చేందుకు కట్టుబడుందన్నారు. అయితే చంద్రబాబు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే సీనియర్ల వారసులకే టికెట్లిచ్చి యూత్ కు టికెట్లిచ్చామంటే వాళ్ళు గెలిచేది అనుమానమే. వారసులకు కాకుండా ఇప్పటినుండే కొత్తతరాన్ని ప్రోత్సహిస్తేనే జనాలకు పార్టీ ఫ్రెష్ గా కనిపిస్తుంది. అప్పుడే యూత్ కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. తమకోసం ఓట్లు ఓయించుకునే క్రమంలో పార్టీని కూడా బలోపేతం చేస్తారు. అంతేకానీ సీనియర్లని, సీనియర్ల వారసులనే ప్రోత్సహిస్తానంటే చంద్రబాబు చెప్పినట్లు ఎప్పటికీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే.