ఇదిగో వీరే ఇక జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులు?

Chakravarthi Kalyan
ఇటీవలే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సీఎం జగన్ ఇప్పుడు పాలనపై మరింతగా దృష్టి సారించారు. ఇప్పుడు జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకాలను చేశారు. జిల్లాలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా రాజన్నదొరను నియమించారు.

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రిగా గుడివాడ అమర్నాథ్‌, విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా బూడి ముత్యాలనాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా దాడిశెట్టి రాజా, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పినిపె విశ్వరూప్‌ను నియమించారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తానేటి వనితను నియమించారు. పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు, బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కొట్టు సత్యనారాయణ, అమలాపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా జోగి రమేశ్‌, ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా మేరుగు నాగార్జున, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా విడదల రజనిని నియమించారు.

అలాగే.. నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా అంబటి రాంబాబు.. కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఆదిమూలపు సురేశ్‌... అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి... అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా రోజా .. తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నారాయణ స్వామి... నంద్యాల  జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా అంజాద్ బాషా...వ్యవహరించనున్నారు. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ , శ్రీసత్యసాయి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా గుమ్మనూరు జయరాం, చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: