ఆంధ్రప్రదేశ్ లో ఆర్టికల్ 360 అమలు ?
ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలన్నారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకర పాలన సాగుతోందని.. జగన్ ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారు అని అనేక సార్లు మేము చెప్పిన విషయాన్ని కాగ్ నివేదిక మరోమారు స్పష్టం చేసిందని వెల్లడించారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. 48 వేల కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా పెట్టారు ఏమయ్యాయి అని , ట్రెజరీ కోడ్ ఉల్లంఘించారు అని కాగ్ పేర్కొందన్నారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సొంత కంపెనీ లాగా భావిస్తున్నారని చెప్పారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారు జగన్ రెడ్డి అన్నారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు.
నాయకత్వం లేదు, విజన్ లేదు ఒక కంపెనీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. పన్నులు వేసి ప్రజలను పిండి పిండి చేస్తున్నారని.. పార్లమెంటు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంకు శాసనసభలో సవరణలు చేయలేరన్నారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఇదే విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది.. పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా కొట్టేయగల అధికారం న్యాయస్థానాలకు ఉందని చెప్పారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజ్యాంగాన్ని చట్ట సభలను అపహాస్యం చేస్తున్నారు.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రాజ్యాంగ సంస్థలను అపహాస్యం చేయరాదన్నారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఉదేశ పూర్వకంగా, కుట్రపూరితంగా కోర్టుల మీద ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్న చేస్తున్నరన్నారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. పార్లమెంట్ చేసిన చట్టాలు, చట్టాలకు చేసిన సవరణలు రాజ్యాంగ పరిధిలో లేకపోతే న్యాయ స్థానాలు కొట్టేయ గలవు, ఇలాంటి సందర్భాలు గతంలో ఉన్నాయి.. న్యాయస్థానాలు కొట్టివేసినప్పుడు పార్లమెంట్లో చర్చలు చేయలేదన్నారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు.