సోనియా వార్నింగ్ : ఇష్టానుసారంగా చేయాలనుకుంటే వెళ్లిపోవచ్చు..!

MOHAN BABU
 గత కొద్దిరోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి జగ్గు రచ్చ పీక్ స్టేజ్ కి చేరుకుంది. చిలికి చిలికి గాలివానలా మారి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానాన్ని తాకింది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ అపజయానికి కారణాలు వెతుకుతుంటే, పంజాబ్ లో ఎలాగైతే అసమ్మతి చెలరేగి అధికారం కోల్పోయారో సేమ్ టు సేమ్ అదే సీన్ జగ్గారెడ్డి  నుంచి ఎదురవుతోంది. మరి ఇదంతా చూస్తూ వస్తున్న సోనియా జగనన్నకు అడ్డుకట్ట వేస్తుందా లేదా అన్నది ముందున్న సమస్య. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో మంచి దూ కుడు మీదికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రకంగా  జగ్గా రెడ్డి నిర్వీర్యం చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలి సిందే.

మరి దీనిపై అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అనేది కార్యకర్తల్లో నెలకొని ఉన్నటువంటి సమస్య. తెలంగాణలో ఎంతో క్యాడర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంటి పోరు ఇబ్బంది పెడుతుందని అర్థమవుతుంది. మరి దీనిపై అధిష్టానం  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది  అనేది తెలుసుకుందాం..! కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యమే కొన్నిసార్లు ఆ నేతలను శృతిమించేలా చేస్తుంది. ఆ సమయంలో హైకమాండ్ రంగంలోకి దిగుతుంది. నేతల నోళ్లకు తాళం వేస్తుంది. తెలంగాణ ఇచ్చినా ఎందుకు అధికారంలోకి రాలేకపోతుందని ఢిల్లీ పెద్దలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ రాష్ట్రంలోని నేతలు మాత్రం ఒకరిపై ఒకరు బురద పోసుకుంటూ కాంగ్రెస్ పార్టీని జనంలో చులకన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చిన తర్వాత రేగిన అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూ ఉంది.

 దీంతో హైకమాండ్ దూతలు రంగప్రవేశంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. నోరు విప్పితే జాగ్రత్త.. అంటూ కొంతమంది పేర్లు చెపుతూ మాట్లాడుతున్న సీనియర్లకు వార్నింగులు ఇస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబడ్దార్ అన్న సంకేతాలు కూడా పంపించినట్టు తెలుస్తోంది. పార్టీలను చులకన చేయొద్దు అని నేతలకు హుకుం జారీ చేశారని రేవంతు అనుచరులు అంటున్నారు. ఇలాంటి వారు ఉంటే ఉండండి పోతే పొండి అంటూ క్లారిటీ ఇచ్చినట్లు కూడా సమాచారం. ఏది ఏమైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నా నేతల మధ్య సఖ్యత లేఖ నీరుకారిపోతుంది అనేది అక్షరాల నిజం అని కార్యకర్తలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: