అసెంబ్లీలో చిడతలు కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు... ఇక మిగిలింది అదేనా?

VAMSI
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది. మామూలుగా అసెంబ్లీ లో ప్రతిపక్షానికి చెందిన సభ్యులు అధికార పక్షం చేసిన చట్టాలకు మరియు సభా సమయంలో అధికార పార్టీ సభ్యులు చేసే వ్యాఖ్యలకు అడ్డు పడుతుంటారు. కొని సార్లు ఇలాంటివి వివాదాలుగా మారి పెద్ద తలనొప్పిగా తయారవుతుంటాయి. అయితే ఇదే విధంగా నిన్న శాశన మండలి లో టీడీపీ ఎమ్మెల్యేలు సభ జరుగుతున్న సమయంలో ఈలలు వేసి సభను డిస్టర్బ్ చేశారు. అయితే ఎలాగూ నిన్న ముగిసింది.
అయితే నేటి అసెంబ్లీ కి మాత్రం టీడీపీ సభ్యులు చిడతలు తీసుకు వచ్చి వాయించడం కాస్త సభా హక్కులు ఉల్లంఘన అని చెప్పాలి. అయితే ఈ సంఘటన పట్ల స్పీకర్ తమ్మినేని ఎంత చెబుతున్నా వినకుండా చిడతలు వాయిస్తూనే  ఉన్నారు. అయితే టీడీపీ సభ్యులు వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు భజనలు చేయడం గమనార్హం. ఈ పద్దతి మంచిది కాదని... స్పీకర్ పదే పదే చెబుతున్నా వినకుండా గోల చేస్తుండడంతో, స్పీకర్ తమ్మినేని ఆ చిడతలు తీసుకోవాలని మార్షల్స్ కు సూచించారు. ఆ తర్వాత సిబ్బంది టీడీపీ సభ్యులు నుండి ఆ చిడతలను తీసుకున్నారు.
అయితే వీరి వ్యవహారంపై జక్కంపూడి రాజా మాట్లాడుతూ సభలో ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని, అంకు ఎందుకో వీరి శైలిలో తేడా కనబడుతోంది అని, రేపటి నుండి సభకు వచ్చే ముందు వీరిని ఆల్కహాల్ చెక్ చేసి పంపాలని కామెంట్ చేశారు. ఇక మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ మీరు ఇక్కడ చిడతలు వాయించడం కాదు, అక్కడ మీ చంద్రబాబు దగ్గరకెళ్ళి జీవితాంతం చిడతలు వాయించునుకోండి అంటూ ఘాటుగా బదులిచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: