పవన్ ఎఫెక్ట్: రిస్క్‌లో ఆ మంత్రులు?

M N Amaleswara rao
అవును పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది మంత్రులు రిస్క్‌లో పడతారని చెప్పొచ్చు...పవన్ గాని టీడీపీతో కలిసి ముందుకెళితే పలువురు మంత్రులు నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపుకు దూరమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి..గత ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేయడం వల్ల చాలామంది వైసీపీ నేతలకు లాభం జరిగింది...వారు ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. అలాగే అదృష్టం కొద్ది మంత్రులు కూడా అయిపోయారు. అలా ఓట్లు చీలడం వల్ల ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటు మంత్రులైన పలువురు నేతలు నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిస్తే మాత్రం గెలవరని చెప్పొచ్చు.
అంటే పవన్ ఎఫెక్ట్ వల్ల వారు గెలుపుకు దూరమైపోతారని చెప్పొచ్చు...అలా పవన్ ప్రభావం ఎక్కువ ఉన్న మంత్రులు పలువురు ఉన్నారు...మొదటగా మంత్రి పేర్ని నానికి చెక్ పడే అవకాశం ఉంది..గత ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి తక్కువ మెజారిటీతోనే టీడీపీపై గెలిచారు..కానీ అక్కడ జనసేనకు ఓట్లు బాగానే పడ్డాయి. అంటే నెక్స్ట్ టీడీపీ-జనసేన కలవబోతున్నాయి కాబట్టి...పేర్నికి నెక్స్ట్ గెలవడం కాస్త కష్టమే అని చెప్పొచ్చు.
ఇక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ది అదే పరిస్తితి..విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన వెల్లంపల్లికి..నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనల కాంబో చెక్ పెట్టొచ్చు. అలాగే ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆళ్ళ నాని, ఆచంట నుంచి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఓటమి అంచుకు వెళ్ళేలా ఉన్నారు. తూర్పు గోదావరిలో ముగ్గురు మంత్రులకు టీడీపీ-జనసేన ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. కాకినాడ రూరల్-కన్నబాబు, అమలాపురం-విశ్వరూప్, రామచంద్రాపురం-చెల్లుబోయిన వేణుగోపాల్‌పై పవన్ ఎఫెక్ట్ ఎక్కువే.
అలాగే భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్‌కు రిస్క్ ఎక్కువ ఉంది...గత ఎన్నికల్లో ఓట్లు చీలడం వల్లే అవంతి గెలిచేశారు..ఈ సారి మాత్రం ఆ ఛాన్స్ కనిపించడం లేదు. ఇక ప్రత్తిపాడులో మేకతోటి సుచరిత, నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్‌కు కూడా పవన్ వల్ల రిస్క్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు...మొత్తానికి టీడీపీ-జనసేనల పొత్తు ఉంటే ఈ మంత్రులు అస్సామే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: