కమలం వద్దు..కమ్యూనిస్టులే ముద్దు!

M N Amaleswara rao
ప్రతిపక్షాలు ఏకమై జగన్ ప్రభుత్వంపై పోరాడాలి..తమతో ఇతర పార్టీలు కలిసి రావాలి...అయితే పొత్తు విషయంలో వన్ సైడ్ లవ్ వల్ల ఉపయోగం లేదు...ఇవి టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు..వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చే ప్రసక్తి లేదు..పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాలు పక్కన పెట్టి వస్తే పొత్తు గురించి ఆలోచిస్తా...ఇవి పవన్ చెప్పిన మాటలు..సరే మాటలు వేరు వేరుగా ఉన్నా సరే..వాటి అర్ధం ఒకటే అని చెప్పొచ్చు. అటు చంద్రబాబు గాని, ఇటు పవన్‌గాని పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారని పరోక్షంగా అర్ధమైపోతుంది. అంటే టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు దాదాపు ఖాయమని రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది.
సరే టీడీపీ-జనసేనలు పొత్తుకు వెళితే మరి బీజేపీ పరిస్తితి ఏంటి? అంటే ఏమో బీజేపీ అసలు కలుస్తుందా? లేక కలుపుకుంటారా? అనేది పూర్తిగా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే జనసేన-బీజేపీలు కలిసి ఉన్నాయి..అంటే బీజేపీని కలుపుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారు...అటు చంద్రబాబుకు కూడా బీజేపీతో పొత్తు ఓకే...కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉంటే మేలు జరుగుతుందనేది బాబు ఆలోచన.
కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది...బీజేపీ మాత్రం చంద్రబాబుతో కలిసే ప్రసక్తి లేదని అంటుంది..టీడీపీతో పొత్తు పెట్టుకోబోమని చెప్పేస్తున్నారు...సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ లాంటి వారు టీడీపీపై ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. అటు జాతీయ నాయకత్వం కూడా బాబు పట్ల అంత పాజిటివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే బీజేపీనే కాదు...టీడీపీ నేతలు గాని, కార్యకర్తలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టపడటం లేదు...అసలు ఆ పార్టీ వల్లే ఈ పొజిషన్‌లో ఉన్నామనే కోపం టీడీపీ శ్రేణుల్లో ఉంది. పైగా కేంద్రం, రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. అయిన బీజేపీ వల్ల పావలా ఉపయోగం ఉండదు...ఒకశాతం కూడా ఓట్లు లేవు. అసలు బీజేపీ కంటే కమ్యూనిస్టులే బెటర్ అని తమ్ముళ్ళు అనుకుంటున్నారు. కమ్యూనిస్టులకు కొన్ని నియోజకవర్గాల్లో బలం బాగానే ఉంది..కాబట్టి కమలాన్ని పక్కనబెట్టి కమ్యూనిస్టులని కలుపుకోవాలని, లేదంటే సింగిల్ గానే పోటీకి దిగుదామని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: