టీడీపీ-జనసేన కాంబో..ఫ్యాన్స్‌కు కష్టాలే?

M N Amaleswara rao
ఏపీలో అధికార బలంతో దూసుకుపోతున్న వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేనలు రెడీ అవుతున్నాయి...రెండు పార్టీలు కలిసి పోటీ చేసి వైసీపీని ఓడించి అధికారం దక్కించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాయి...ఇప్పుడు ఆ దిశగానే రాజకీయం నడుస్తుందని చెప్పొచ్చు..తాజాగా పవన్..వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చే ప్రసక్తి లేదని చెప్పి..టీడీపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. అయితే టీడీపీ-జనసేనలతో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది తర్వాత చూడాలి...కానీ టీడీపీ-జనసేనల పొత్తు దాదాపు ఖాయమనే చెప్పొచ్చు.
ఎందుకంటే ఆ రెండు పార్టీలు కలిస్తేనే వైసీపీని ఎదుర్కోగలవు...అలా కాకుండా విడిగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకే చాలా లాభం..ఆ విషయం 2019 ఎన్నికల్లోనే రుజువైంది. జనసేన ఎక్కడికక్కడ ఓట్లు చీల్చేసి టీడీపీకి ఫుల్‌గా డ్యామేజ్ చేసేసింది...దాని వల్ల వల్ల వైసీపీకి బాగా లాభం జరిగింది..కానీ ఈ సారి అలా జరగకూడదని చెప్పి చంద్రబాబు, ఎప్పటినుంచో పవన్‌ని కలుపుకోవడానికి చూస్తున్నారు. కానీ పవన్ నుంచి స్పందన సరిగ్గా లేదు...అయితే తాజాగా పొత్తుపై ఆసక్తిగానే ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు.
అంటే టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖాయమే..ఇందులో ఎలాంటి డౌట్ లేదు...ఇక రెండు పార్టీల పొత్తు ఫిక్స్ అయితే చాలామంది ఫ్యాన్ ఎమ్మెల్యేలు ఓటమి బాట పట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు జనసేన ఓట్లు చీల్చడం వల్లే గెలిచారు...అంటే వారికి టీడీపీపై వచ్చిన మెజారిటీ కంటే, వారు పోటీ చేసిన స్థానాల్లో జనసేనకు వచ్చిన ఓట్లే ఎక్కువ..కాబట్టి టీడీపీ-జనసేనలు కలిసి బరిలో దిగితే దాదాపు 60 స్థానాల్లో ఫలితాలు మారిపోయే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ముఖ్యగా కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా రావోచ్చు...ఈ జిల్లాల్లో దాదాపు 50 సీట్లలో వైసీపీకి గెలుపు చాలా కష్టమని అంటున్నారు...ఇక మిగిలిన జిల్లాల్లో 10 స్థానాల్లో వైసీపీకి యాంటీ ఉండే పరిస్తితి ఉంది. మొత్తానికైతే టీడీపీ-జనసేన ప్రభావం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలకు రిస్క్ ఎక్కువే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: