అంటుకున్న కార్చిచ్చు.. ఫారెస్ట్ బీట్ లో చెలరేగిన మంటలు?

praveen
ఇటీవలి కాలంలో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఇక పోలీసుల దృష్టి మరల్చేందుకు ఎన్నో విచిత్రమైన పనులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా శేషాచలం అటవీ ప్రాంతంలో రెచ్చిపోతున్న దొంగలు ఏకంగా అడవినే దహనం చేసేందుకు సిద్ధమయ్యారు.. అటవీశాఖ అధికారుల దృష్టి మరల్చేందుకు దట్టమైన అటవీ ప్రాంతంలో అగ్గి రాజేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇలాంటివి చర్యలకు పాల్పడుతున్నారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

 ఇటీవలే స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అటవీ ప్రాంతంలోనే కరకంబాడి ఫారెస్ట్ బీట్ నిప్పంటించారు. ఈ క్రమంలోనే మంటలు ఎగసి పడ్డాయి. అయితే ఎట్టకేలకు అటు అటవీశాఖ అధికారులు ఎంతో కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక ఇటీవల కాలంలో శేషాచలం అడవుల్లో తరచు చెలరేగుతున్న కార్చిచ్చు తో అరుదైన వృక్ష జంతు జాతులు కూడా అంతరించిపోతున్నాయి. భారీ నష్టం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై సీరియస్గా దృష్టి పెట్టిన అటవీశాఖ అధికారులు స్మగ్లర్లు కావాలనే అధికారులు దృష్టి మరల్చేందుకు ఇలాంటివి చేస్తున్నారు అని గుర్తించారు.

 ఇలా ఎర్ర చందనం స్మగ్లర్ల పేరుతో అటు అడవికి అపారమైన నష్టం జరుగుతుందని.. వందల సంఖ్య లో వన్య  ప్రాణులు అగ్నికి ఆహుతి గా మారి పోతున్నాయి.. పచ్చడి తోరణం లాంటి అడవి చివరికి బూడిదలా మారి పోతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో అడవుల్లో కార్చిచ్చులు వస్తూ ఉండటంతో అడవుల్లో ఉండే క్రూరమృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. దీంతో ఇక ఏ క్షణంలో క్రూరమృగం దాడి చేస్తుందోనని గ్రామాల్లో ఉన్న ప్రజలు  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  బ్రతకాల్సిన పరిస్థితివచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: