ఆ ఇద్దరికి ఇచ్చిన మాటని జగన్ నిలబెట్టుకుంటారా?

M N Amaleswara rao
గుంటూరులో మంత్రి పదవి దక్కించుకునేది ఎవరు? గత ఎన్నికల్లో మంగళగిరిలో ప్రచారం సందర్భంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారా? లేక మరో నేత మర్రి రాజశేఖర్ కు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? అనే అంశాలు ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారాయి..తాజాగా జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పడంతో..ఇప్పుడు గుంటూరు నుంచి ఎవరికి మంత్రి పదవి వస్తుందనే ఆసక్తి ఎక్కువ ఉంది..ప్రస్తుతం గుంటూరు నుంచి హోమ్ మంత్రి సుచరిత ఒక్కరే క్యాబినెట్ లో ఉన్నారు...ఇక ఈమెని ఇప్పుడు మంత్రివర్గం నుంచి తప్పించడం గ్యారెంటీ...ఇక ఈమెని తప్పించి, ఎవరిని క్యాబినెట్ లోకి తీసుకుంటారో చూడాలి...అలాగే గుంటూరు నుంచి మరొకరికి క్యాబినెట్ లో చోటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే గుంటూరు నుంచి ఎక్కువ మంది నేతలు మంత్రి రేసులో ఉన్నారు...ఆళ్ళ రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, కోన రఘుపతి, విడదల రజిని లాంటి వారు పదవి ఆశిస్తున్నారు...ఇక వీరిలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది జగన్ ఇష్టం...కానీ తాను మాట ఇచ్చి తప్పరు కాబట్టి...ఆర్కే, మర్రిలకే పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆర్కే మంగళగిరిలో పోటీ చేయగా, ఆయనపై నారా లోకేష్ పోటీ చేశారు. అప్పుడు జగన్ ఎన్నికల ప్రచారానికి వచ్చి...ఆర్కేకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు...కానీ అధికారంలోకి వచ్చాక ఆర్కేకు మొదటి విడతలో పదవి రాలేదు...మరి ఇప్పుడు పదవి దక్కుతుందో లేదో చూడాలి.
ఇక విడదల రజిని కోసం చిలకలూరిపేట సీటుని వదులుకున్న మర్రి రాజశేఖర్ కు కూడా పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు..అయితే ఆయనకు ఇప్పుడు పదవి ఇస్తారో లేదో తెలియడం లేదు...ఆయనకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు...మరి ఇప్పుడు మంత్రి వర్గంలోకి తీసుకుని ఆరు నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తారేమో చూడాలి. మరి జగన్...ఇద్దరు నేతలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: