చిత్తూరు సీటు మళ్ళీ పోయేలా ఉంది!

M N Amaleswara rao
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెద్దగా సత్తా చాటిన సందర్భాలు తక్కువనే చెప్పొచ్చు..చంద్రబాబు సొంత జిల్లా అయిన సరే ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవానే నడుస్తుంది...ఈ జిల్లాలో ఉన్న పలు నియోజకవర్గాల్లో టీడీపీకి పెద్దగా పట్టు కూడా లేదనే చెప్పొచ్చు..అలా టీడీపీకి ఏ మాత్రం పట్టు లేని స్థానాల్లో చిత్తూరు అసెంబ్లీ కూడా ఒకటి. మొదట నుంచి చిత్తూరులో టీడీపీ సత్తా చాటలేదు..కేవలం 2004, 2014 ఎన్నికల్లోనే ఇక్కడ టీడీపీ గెలిచింది...ఇంకెప్పుడు ఇక్కడ టీడీపీ గెలవలేదు.
గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది...అది కూడా సీకే బాబు చిత్తూరులో అద్భుత విజయాలు అందుకున్నారు...టీడీపీ గాలి ఉన్న 1994, 1999 ఎన్నికల్లో కూడా సీకే బాబు కాంగ్రెస్ నుంచి గెలిచారు..అయితే 2004లో వరుసగా ఓడిపోతున్న సానుభూతి ఉండటంతో టీడీపీ గెలిచింది...ఇక 2009లో మళ్ళీ ఓడిపోగా, 2014 ఎన్నికల్లో ఇంకోసారి గెలిచింది...2019 ఎన్నికలోచ్చేసరికి మళ్ళీ దెబ్బతింది..ఈ సారి వైసీపీ అద్భుతమైన మెజారిటీతో గెలిచింది.
మరి ఈ సారైనా టీడీపీ గెలుస్తుందా? అంటే అబ్బే మరొకసారి చిత్తూరులో టీడీపీకి గెలిచే అవకాశాలు కనిపించడం లేదు..ఇక్కడ పూర్తిగా వైసీపీ హవా కనిపిస్తుంది..ఎమ్మెల్యే శ్రీనివాసులు సైతం స్ట్రాంగ్ గా ఉన్నారు...పైగా చిత్తూరులో టీడీపీకి సరైన నాయకత్వం లేదు..గత ఎన్నికల్లో ఓడిపోయిన ఏ‌ఎస్ మనోహర్...పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు...అటు మాజీ ఎమ్మెల్యే డి‌ఏ సత్యప్రభ మరణించారు...దీంతో ఇక్కడ టీడీపీకి నాయకులు లేరు.
అయితే చిత్తూరు సీటు కోసం కొందరు నేతలు ట్రై చేస్తున్నారు...అందులో చంద్రగిరి బాధ్యతలు చూసుకుంటున్న పులివర్తి నాని, చిత్తూరుకు వచ్చేయాలని అనుకుంటున్నారు...ఎందుకంటే చంద్రగిరిలో గెలవడం కష్టమని ఆయనకు అర్ధమైపోయింది..ఈయనతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా చిత్తూరు సీటు కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఎవరు పోటీకి దిగిన చిత్తూరులో టీడీపీ గెలవడం అనేది జరిగేలా లేదు...ఇక్కడ మళ్ళీ వైసీపీ పార్టీనే గెలిచేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: