మద్యపాన ‘నిషేధం’..జగనన్న గ్రేట్!

M N Amaleswara rao
మద్యపాన నిషేధం...రాజకీయాల్లో సాధ్యం కాని హామీ..కానీ ఈ హామీని సాధ్యం చేస్తామని చెప్పి నాయకులు అధికారాన్ని దక్కించుకుంటారు..ఇది అసలు జరగని పని అని నాయకులకు తెలుసు..అంటే మనసు పడితే అవుతుంది..కానీ మనీ తీసుకొచ్చే ఈ పని చేయాలని ఎవరు అనుకున్నారు..కాకపోతే ఓట్ల కోసం మాత్రం మద్యపాన నిషేధం అంటారు...అయితే అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం హామినే నిషేధిస్తారు.
ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం ఆ దిశగానే వెళుతుంది..గత ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్...మద్యపానం వల్ల చాలా కుటుంబాలు నాశనమైపోతున్నాయని, ఆడబిడ్డల భవిష్యత్ దెబ్బతింటుందని చెప్పి..మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు...దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు...కానీ అధికారంలోకి వచ్చాక ఆ దిశగానే ముందుకెళుతున్నారా? అంటే ఆ విషయం హామీ విన్న ఆడబిడ్డలని అడిగితే బెటర్ అని చెప్పొచ్చు..ఈ కోశాన మద్యపాన నిషేధం హామీ అమలు కావడం లేదు...పైగా నాసిరకం మద్యాన్ని భారీ ధరలకు అమ్ముతూ...మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు చేస్తున్నారు. మరి ఇదేనా జగన్ చెప్పిన మద్యపాన నిషేధం అంటే...ఇదే అనుకోవాలి మరి అంతకుమించి ప్రజలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు.
అయితే మద్యం ధరలు పెరగడం, నాసిరకం మద్యం వల్ల గంజాయి, నాటు సారా బాగా పెరిగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి..ఆరోపణలకు తగ్గట్టు పలు సంఘటనలు కూడా జరుగుతున్నాయి...తాజాగా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పలువురు చనిపోయారు...కానీ ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం వేరేగా చెప్పే ప్రయత్నం చేస్తుందని టీడీపీ ఫైర్ అవుతుంది. ముమ్మాటికి ఇవి ప్రభుత్వ హత్యలే అంటున్నారు.
ఇక టీడీపీ విమర్శలకు వైసీపీ కౌంటర్లు ఇస్తుంది...కాకపోతే ఈ కౌంటర్లు కాస్త వింతగా ఉన్నాయి. గతంలో బాబు అమలు చేసిన మద్యం పాలసీలపై ఇప్పుడు వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అసలు అప్పుడు ఏం జరిగిందో కంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది..ఈ మరణాలు ఏంటి...మద్యపాన నిషేధం హామీ ఏమైందనే విషయంపై మాత్రం మాట్లాడటలేదు. అంటే మద్యపాన నిషేధం చేయకపోయిన సరే...జగనన్న గ్రేట్ అన్నట్లు వైసీపీ నేతలు భజన చేస్తున్నారు...మరి దీనిపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: