మంచు మోహన్ బాబు, విష్ణు లకు బిగ్ షాక్ ?

Veldandi Saikiran
బిసీ కులాల్లో అత్యంత వెనక బడిన నాయి బ్రాహ్మణ కులాన్ని నీచంగా కించపరిచిన మంచు మోహన్ బాబు,విష్ణు పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట మానవ హక్కుల కమిషన్ ను  ఆశ్రయించారు నాయి బ్రాహ్మణ సంఘాలు. అంతే కాదు తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న నాయి బ్రాహ్మణ సంఘాల నాయకుల తో కలిసి తెలంగాణ రాష్ట్ర  హెచ్చార్సీ లో ఫిర్యాదు చేశా రు ఆ సంఘం అధ్యక్షులు పాల్వయి శ్రీనివాస్ . ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 75 ఏళ్లు స్వతంత్ర అనంతరం కూడా కులాలపై దాడులు జరుగుతున్నాయని, ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం మాదిరి తమకు కూడా చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఆ సంఘం అధ్యక్షులు పాల్వయి శ్రీనివాస్ .. 

మంచు మోహన్ బాబు ఇంటిలో నాగ శ్రీను అనే వ్యక్తి గత 11 ఏళ్లుగా హెయిర్ డ్రెస్సర్ గా నమ్మకం గా పని చేస్తున్నాడని,అన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు రూ . 5 లక్షల విలువగల వస్తువులు దొంగిలించినట్లు తప్పుడు కేసులు బనాయించి కులం పేరుతో దూషించి ,నాగ శీనుపై దురుసుగా ప్రవర్తించి మనోభావాలను కించపరిచారని కమిషన్ కు వివరించారు ఆ సంఘం అధ్యక్షులు పాల్వయి శ్రీనివాస్. మోకాళ్లపై కూర్చోబెట్టి , మంగళి కొడకా అంటూ కులం పేరుతో నానా దుర్భాషలాడుతూ కించపరిచారని అన్నారు ఆ సంఘం అధ్యక్షులు పాల్వయి శ్రీనివాస్ .. మోహన్ బాబు ఆరోపించినట్లుగా లైవ్ డిటెక్టర్ ను మోహన్ బాబుతో సహా బాధితుడు నాగ శీను కూడా నిర్వహిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని కమిషన్ కు  చెప్పారు ఆ సంఘం అధ్యక్షులు పాల్వయి శ్రీనివాస్. పోలీసులు తప్పుడు కేసుల పై కేసు నమోదు చేయకుండా సమగ్రంగా న్యాయవిచారణ చేసి బాధితుడికి అండగా నిలవాలని శ్రీనివాస్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోగిలి గిద్ద వినోద్ కుమార్,ధనరాజ్ నాయి,ఆనంద్ నాయి,జెంపాల రాజేశ్ నాయి,రమేష్ నాయి,చక్రవర్తి నాయి,భాగ్యలక్ష్మి నాయి,బాబు నాయి,రఘు నాయి,రామ కృష్ణ నాయి,తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: