యనమల: జగన్ ఇకనైనా మేలుకో... కోర్ట్ తీర్పును గౌరవించు?

VAMSI
ఏపీ ప్రభుత్వానికి గత సంవత్సరం నుండి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు ల నుండి ఎన్ని ప్రతికూల తీర్పులు వచ్చాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా మరొక విషయంలో కూడా హై కోర్ట్ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని అంశం ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే ఏపీ రాజధానిగా గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని నిర్ణయించి అక్కడ రాజధాని పనులు మొదలు పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయి వైసీపీ వచ్చిన తర్వాత జగన్ అక్కడ రాజధాని అంత అనుకూలం కాదు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించడానికి భూమిలో బలం లేదు అని రాజధానిని మార్చడానికి నిర్ణయం తీసుకుని, ఏపీకి మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు.
ఇక అప్పటి నుండి ప్రభుత్వ వ్యతిరేకుల నుండి ఈ విజయానికి విరుద్ధంగా ఫిర్యాదులు హై కోర్టులో నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంపై హై కోర్టు ఒక తీర్పును ఇచ్చింది. అయితే తీర్పు గురించి ప్రతిపక్ష పార్టీ కావొచ్చు లేదా ఇతర వ్యతిరేకులు కావొచ్చు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. తాజాగా ఈ తీర్పుపై టీడీపీ సీనియర్ నేత మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాజధానిపై హై కోర్ట్ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము.  మేము మొదటి నుండి చెబుతున్న విషయమే ఇప్పుడు హై కోర్టు అధికారికంగా తీర్పు ఇచ్చింది. మూడు రాజధానుల బిల్లు చెల్లదు.
అయితే జగన్ నియంతృత్వ పరిపాలనకు ఇది చెంపపెట్టు లాంటిది అని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి వైసీపీ రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుని వెళుతోంది. అయితే ఇప్పటికైనా జగన్ రెడ్డికి మరియు ఏపీ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమో చూడాలి. అయితే ఎప్పటి లాగే జగన్ మరో కోర్ట్ లో అప్పీలుకు వెళ్లకుండా కోర్ట్ తీర్పును గౌరవించి మూడు రాజధానుల అంశాన్ని ఇంతటితో ఆపేయాలని యనమల హితవు పలికారు. మరి ఈ హై కోర్టు నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: