మాయ పైనే కమలం ఆశలు.. అఖిలేష్ కి షాకేనా..!

MOHAN BABU
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తి కాగా ఇందులో బిజెపి, ఎన్సీపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సొంత గడ్డ గోరఖ్ పూర్ తో సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరగబోతోంది. దీంతో ఈ దశ పోలింగ్ యోగికి కీలకంగా మారింది. పశ్చిమ యూపీలో మొదలైన అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు పూర్వాంచల్ గా పేర్కొని తూర్పు యూపీలో అడుగుపెట్టాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత గడ్డ గోరఖ్ పూర్ తో పాటు దాని చుట్టుపక్కల నియోజకవర్గాలు ఈరోజు పోలింగ్ కు సిద్ధం అయ్యాయి. సాంప్రదాయకంగా దళిత వెనుకబడిన కుల రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బీఎస్పీ ప్రభావం కూడా ఎక్కువే. దీంతో బీఎస్పీ సాయంతో తాము ఆధిక్యం ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది.

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగిలిన బీఎస్సీ సోషల్ ఇంజనీరింగ్  ఇప్పటికీ ఇక్కడ సజీవంగానే ఉందనే అంచనాలు ఉన్నాయి . వాస్తవానికి ఈ ఒక దశ అనే కాకుండా బీఎస్పీ చీల్చే ఓట్లపైనే కమలం ఆశలు పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా బరిలో నిలిచింది. తమ ప్రధాన ఓటుబ్యాంకు గా పేరున్న దళితుల తోపాటు ఓబిసి లోని కొన్ని వర్గాల మద్దతును తిరిగి కూడగట్టుకోవడంలో  మాయావతి సఫలీకృతం అవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయని అంటున్నారు. కానీ రాష్ట్రంలో సొంతంగా బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీఎస్పీ ఎక్కువ ఓట్లు సాధించడం ద్వారా బిజెపి, ఎస్పీ మధ్య నువ్వా నేనా అన్న తరహాలో పోటీ ఉన్న స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 ఈరోజు ఎన్నికలు జరిగే తూర్పు యూపీ నియోజకవర్గాల్లో బీఎస్పీ పార్టీ బలంగా ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. ఇప్పటివరకు బీజేపీ, సమాజ్వాది పార్టీల మధ్య ధ్విముఖ పోరుగా సాగుతున్న ఎన్నికల్లో తొలిసారి బీఎస్పీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇక్కడ ముక్కోణపు పోరును కాషాయ దళం కోరుకుంటుంది. ముక్కోణపు పోరు జరిగి బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోతే  అది తమకు లాభిస్తుందని బిజెపి అంచనా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: