వివేకా హత్య కేసులో బుద్దావెంకన్న సంచలనం ?

Veldandi Saikiran
అమరావతి :  వైఎస్ వివేకా హత్య కేసులో అసలు దోషులు‌ బయట పడుతున్నారని.. తన పేరు బయటకు వస్తుందనే భయం జగనుకి భయం పట్టకుందని రెచ్చిపోయారు బుద్దా వెంకన్న.  అందుకే సలహాదారుడు సజ్జలతో మాట్లాడి స్తూ కొత్త నాటకానికి జగన్ తెర లేపారని.. వివేకా వ్యక్తిత్వం గురించి గతంలో వైఎస్ గొప్పగా చెప్పారని.. అటువంటి వ్యక్తి గురించి వైసిపి నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా వెంకన్న. తండ్రి హత్య కేసులో దోషులను శిక్షించాలని సునీత పోరాడుతున్నారని... ఆమె కృషి, సీబీఐ విచారణతో అవినాష్ రెడ్డి చేయించారని తేలిపోయిందని.. అతన్ని రక్షించడానికి నింద సునీత, ఆమె భర్త మీద వేస్తారా..? అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు బుద్దా వెంకన్న.  సునీతను చంద్రబాబు నడిపిస్తున్నారని మాట్లాడటం బుద్ది తక్కువ కాదా..? వివేకా హత్య జరిగిన సమయంలో ఎన్ని కధలు అల్లారో అందరకీ తెలుసన్నారు బుద్దా వెంకన్న. 

 వివేకా గుండెపోటని, ఆ తరువాత హత్య అని ప్రచారం చేసుకుంది వైసీపీ కాదా..ఈ విషయాన్ని క్లోజ్ చేయమని జగన్ అన్నారని సునీతే చెప్పారని వెల్లడించారు బుద్దా వెంకన్న. చంద్రబాబు పై అన్యాయంగా ఆడిపోసుకోవడానికి సిగ్గుందా..? సునీత ఇచ్చిన వాంగ్మూలంలో  జగన్ బంధువుల పేర్లు ఉన్నాయా..? లేవా..? సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డితో పాటు పలువురి పేర్లు బయటకు వచ్చాయి కదా..? అని ఆగ్రహించారు బుద్దా వెంకన్న. వీటి నుంచి దృష్టి మళ్లించడానికి సునీత భర్తే చంపాడని కధనాలు అల్లుతారా..? అని నిప్పులు చెరిగారు బుద్దా వెంకన్న.  దోషులను జగన్ కాపాడాలని సునీతను బలి చేయాలని చూస్తున్నారు...  సవాంగుతో మాట్లాడిన మాటలు, ఇచ్చిన రిపోర్టులతో జగనుకు భయం పట్టుకుందన్నారు బుద్దా వెంకన్న. సజ్జలతో హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టించి చంద్రబాబు పై బురద చల్లాలని చూస్తారా..?అని చెప్పారు బుద్దా వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: