యనమలకు మళ్ళీ దాడిశెట్టి దెబ్బ తప్పదా!

M N Amaleswara rao
మళ్ళీ యనమలకు దాడిశెట్టి దెబ్బ గట్టిగా తగిలేలా ఉంది..సొంత కంచుకోట తునిలో యనమల రామకృష్ణుడు ఫ్యామిలీకి ఛాన్స్ లేకుండా చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు తుని నియోజకవర్గం యనమల కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే...వరుసపెట్టి ఆరుసార్లు తునిలో విజయం సాధించారు..ఇక 2009 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయిన యనమల తర్వాత ప్రత్యక్షంగా ఎన్నికలకు దూరమయ్యారు..2014లో యనమల సోదరుడు కృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేసి...దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈ ఓటమి ఒకసారితో అయిపోలేదు..2019 ఎన్నికల్లో కూడా మరోసారి దాడిశెట్టి తన సత్తా ఏంటో చూపించారు...యనమల ఫ్యామిలీకి మరోసారి ఓటమి రుచి చూపించారు..పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో..దాడిశెట్టి రాజా దూసుకెళుతున్నారు...తునిలో యనమల ఫ్యామిలీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పనిచేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ నేతలు చాలావరకు పుంజుకున్నారు..గత ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడి టీడీపీ నేతలు పికప్ అయ్యారు.
చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలుగా ధీటుగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు...కానీ తునిలో మాత్రం టీడీపీ ఏ మాత్రం పుంజుకోలేదు..యనమల సోదరుడు కృష్ణుడుపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత చాలా ఎక్కువ కనిపిస్తోంది...పైగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై ప్రజా వ్యతిరేకత పెద్దగా రాలేదు. ఈ పరిస్తితులు ఇలాగే కంటిన్యూ అయితే..నెక్స్ట్ ఎన్నికల్లో తునిలో యనమల ఫ్యామిలీ గెలవడం చాలా కష్టమని చెప్పొచ్చు.
అయితే తుని విషయంలో చంద్రబాబు ఏదొక నిర్ణయం తీసుకోవాలి...నెక్స్ట్ తునిలో కృష్ణుడుని అభ్యర్ధిగా తప్పించాల్సి ఉంటుంది..ఇప్పటికే అక్కడ టీడీపీ శ్రేణులు కృష్ణుడుకు సీటు ఇవ్వొద్దనే డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ సీటు ఇస్తే మాత్రం తునిలో దాడిశెట్టి రాజా గెలుపు సులువు అవుతుందని, మళ్ళీ గెలిస్తే మాత్రం తునిలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారవుతుందని, కాబట్టి ఇప్పుడే ఏదైనా మార్పు చేస్తే బెటర్ అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి చూసుకుంటే తునిలో యనమల ఫ్యామిలీకి దాడిశెట్టి దెబ్బ మళ్ళీ తగిలేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: