రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్... టార్గెట్ అదేనా?

VAMSI
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి పోరాట పటిమ ఉన్న నాయకుడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏదైనా అనుకున్నారంటే చేసే వరకు నిద్ర పోరు. ఆ పనిపైనే వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఇప్పుడు వచ్చింది కాదు. ఈయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని బాగా ఆరితేరి పోయారు. ఇదే పోరాట పటిమతో ప్రత్యేక తెలంగాణను సాధించి ఎందరో తెలంగాణ ఉద్యమ అమరవీరులకు అంకితం చేశారు. ఆ విధంగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో సీఎంగా ఉంటూ ప్రజల కోసమే పని చేసే నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కన్ను మోదీ పై పడింది. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ నాయకత్వంలో అధికారాన్ని చేస్తోంది.
అయితే దేశానికి పెద్దగా చేసింది ఏమీ లేకపోగా అదనపు భారాలను ప్రజలపై మోపుతూ భారతదేశానికి మోదీ మరియు ఎన్డీఏ ప్రభుత్వం భారంగా మారిందని ఎన్నో సార్లు కేసీఆర్ బహిరంగంగా చెప్పి ఉన్నారు. అయితే ఎన్డీఏ ను గద్దె దించాలంటే ఒక స్థానిక పార్టీ అయిన తెరాస వలన కాదు. కాబట్టి దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి తద్వారా ఎన్డీఏ ను దెబ్బ తీయాలన్నది కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగా గతంలో దాదాపు ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు అందరితో చాలా సమావేశాలు జరిగాయి. కానీ వివిధ కారణం వలన పూర్తిగా కార్యరూపం దాల్చింది లేదు. కానీ మళ్లీ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్.
గత వారంలో ఇదే విషయం గురించి మాట్లాడడానికి మహారాష్ట్ర కు వెళ్లి సీఎం ఉద్ధవ్ థాకరే మరియు ఎన్సిపి అధినేత శరద్ పవార్ ను కలిశారు. అయితే ఇంతకు ముందే కేసీఆర్ కూటమి ఏర్పాటుకు మద్దతుగా మాజీ ప్రధాని దేవెగౌడ మరియు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ లు ఉన్నారు. ఈ కూటమి విషయాన్ని మరింత వేగవంతం చేయడానికి ఢిల్లీ వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఈ రోజు ఢిల్లీ బయలుదేరాల్సి ఉండగా, ఎందుకో తెలియదు కానీ అది కాస్తా రేపటికి వాయిదా పడింది. రేపు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మరియు కొందరు ముఖ్య నేతలతో ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఢిల్లీ పర్యటనకు సంబంధించి అజెండా ఏమిటి అన్న పూర్తి వివరాలు తెలియకపోయినా ఎన్డీఏ కు వ్యతిరేకంగా పోరాడే కూటమిని ఏర్పాటు చేయడం ప్రధానాంశం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: