ఆ మంత్రులకు టీడీపీ రెడ్లతో రిస్క్?

M N Amaleswara rao
ఈ సారి టీడీపీ నేతలు ఎక్కడా తగ్గేలా లేరు...గత ఎన్నికల్లో అంటే వైసీపీ చేసిన నెగిటివ్ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది..పైగా టీడీపీ నేతలు చేసిన కొన్ని పనులు నెగిటివ్ అయ్యాయి..దీంతో వైసీపీ నేతల గెలుపు సులువైంది...కానీ ఈ సారి మాత్రం టీడీపీ నేతలు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని చూస్తున్నారు...వైసీపీ నెగిటివ్ ప్రచారాన్ని గట్టిగానే తిప్పికొట్టడానికి రెడీ అయ్యారు...అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వరుసపెట్టి గెలుస్తున్న వైసీపీ నేతలకు చెక్ పెట్టాలని తెలుగు తమ్ముళ్ళు రెడీ అవుతున్నారు. ఏదేమైనా వైసీపీ నేతలకు ఓటమి రుచి చూపించాలని చూస్తున్నారు.
ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు...అలాగే మొదట్లో కాస్త పోరాటాలు చేయడానికి భయపడిన స్థానాల్లో కూడా తమ్ముళ్ళు దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో మంత్రులుగా తిరుగులేదని అనుకుంటున్న వారికి టీడీపీలోని రెడ్డి నేతలు చెక్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఏపీలో ఉన్న ముగ్గురు మంత్రులకు ప్రత్యర్ధులకు టీడీపీ నుంచి ముగ్గురు రెడ్లు ప్రత్యర్ధులుగా ఉన్నారు.
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యర్ధిగా చల్లా రామచంద్రారెడ్డి, డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రత్యర్ధిగా సుబ్బారెడ్డి, ఆలూరులో గుమ్మనూరు జయరాంకు ప్రత్యర్ధిగా సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భార్య సుజాతమ్మ ప్రత్యర్ధిగా ఉన్నారు. అసలు పుంగనూరులో పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం అనేది చాలా కషమైన విషయం. అసలు అక్కడ టీడీపీ పేరు చెప్పి కార్యక్రమాలు చేయడానికి కూడా భయపడే పరిస్తితి మొన్నటివరకు ఉంది..కానీ ఇప్పుడు చల్లా వచ్చాక సీన్ రివర్స్ అయింది..ఆయన తనదైన శైలిలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.
అటు డోన్‌లో సుబ్బారెడ్డి కూడా తగ్గేదేలే అన్నట్లు పనిచేస్తున్నారు...ఎలాగైనా డోన్‌లో టీడీపీ జెండా ఎగరవేయాలనే కసితో ముందుకెళుతున్నారు. ఆలూరులో చెప్పాల్సిన పని లేదు...కోట్ల సుజాతమ్మ, జయరాంని డామినేట్ చేసే లీడ్ తెచ్చుకుంటున్నారు. మొత్తానికైతే ఈ ముగ్గురు రెడ్డి నేతలతో వైసీపీ మంత్రులకు కాస్త రిస్క్ ఎక్కువ ఉండేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: