ప్రమాదంలో ఏపీ... జగన్ పై యనమల ఘాటు వ్యాఖ్యలు

VAMSI
మామూలుగా ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, పాలన ఎంత బాగున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేయడం పరిపాటి. ఇప్పుడు సరిగ్గా అంద్ర ప్రదేశ్ లో ఇదే జరుగుతోంది. 2019 లో టీడీపీ ని ఓడించి అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రజల అభిమానంతో పాలన లోనూ దూసుకువెళుతోంది. అయితే ప్రతి ప్రభుత్వం లోనూ పొరపాట్లు ఉన్నట్లే జగన్ ప్రభుత్వంలోనూ కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అయితే వీటిని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసే సమయానికి సమస్యగా మారి జగన్ ను వేధిస్తున్నాయి. అటువంటి పెద్ద సమస్య ఆర్థిక సంక్షోభం. తాజాగా ఈ సమస్య పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఒక రేంజ్ లో చెలరేగిపోయాడు.
ఈయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం యొక్క చేతగాని తనం మరియు మొండితనం కారణం గానే రాష్ట్రం ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కు పోయింది అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నా విధంగా ఆదాయం రాకపోవడం ఆర్థిక సంక్షోభానికి కారణం కాదని లెక్కలతో సహా బయట పెట్టారు యనమల. గతంలో టీడీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఆదాయం కలిగి ఉందని తెలిపారు. అలా చూస్కుంటే మొత్తం 1,25, 995 కోట్ల రూపాయిలు ఆదాయం ఉంది. అయితే ఈ డబ్బంతా ఏమవుతుంది అంటూ ప్రశ్నించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఆదాయం ఆంధ్ర ప్రదేశ్ కు ఉందని ఈ మీడియా సమావేశంలో యనమల తెలిపారు.
అయితే ఆ ఆదాయాన్ని ఈ విధంగా వాడుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలి లాంటి వాటిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని దుయ్యబట్టారు. అంతే కాకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ర్యాంక్ లో ఆంధ్ర ప్రదేశ్ 19 వ స్థానంలో ఉండడం విచారకరం అని యనమల పేర్కొన్నారు. ప్రజలకు అసలు కొనుగోలు చేసే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: