సీఎం జగన్ పై యనమల ఘాటు వ్యాఖ్యలు...
అందులో పీఆర్సీ సమస్య ఒకటి. దాదాపు ఒకటిన్నర నెల వరకు ఉద్యోగులు ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయితే గత వారమే ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అధ్యక్షులను చర్చలకు పిలిచి అంతా సర్ధు బాటు అయ్యేలా చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం చెప్పినట్లు కాకుండా మరో కొన్ని అంశాలను అందులో మిళితం చెయ్యాలని ఒక వినతి పత్రాన్ని ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇదే విషయంపై టీడీపీ సీనియర్ నాయకుడు మరియు పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా యనమల జగన్ ను ఉద్దేశించి, ఉద్యోగులను తమ స్వార్థానికి వాడుకుని ఆ తర్వాత వారి మానాన వారిని వదిలేయడంతో జగన్ దిట్ట అని వ్యాఖ్యలు చేశాడు.
మొన్న జరిగిన విజయవాడ ఉద్యోగుల దీక్షలో పోలీసులు విఫలం అయ్యారని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ను బదిలీ చేయడం చాలా దారుణం అని ఈ సందర్భంగా యనమల చెప్పాడు. ఇక్కడ ఉన్న అన్ని రోజులు గౌతం ను తన రాజకీయ ప్రతీకారానికి అడ్డగోలుగా వాడుకుని ఇప్పుడు తనను అవమానకర రీతిలో పదవీ కాలం ఇంకా వుండగానే బదిలీ చేయడం హేయమైన చర్య అని జగన్ ను దుయ్యబట్టారు. ఇదేమీ మొదటిసారి కాదని ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన మంచి అధికారులు అందరినీ ఇలానే పంపేశారు. అందులో సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, అజేయ కళ్ళం, పీవీ రమేష్, ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఎందరినో బయటకు పంపేశారు.