‘ఒక్కటి’ ఎక్కువైతే గ్రేట్ పుష్ప..!

M N Amaleswara rao
బీజేపీ ఎప్పుడు తెలుగు రాష్ట్రాలకు సాయం పెద్దగా చేయదు గాని...ఎప్పుడుపడితే అప్పుడు రాష్ట్ర విభజన గురించి మాత్రం మాట్లాడుతుంది..విభజనతో ఏపీ బాగా నష్టపోయిందని, కాంగ్రెస్ వల్లే ఇదంతా జరిగిందని ప్రధాని మోదీ విమర్శలు చేస్తుంటారు. తాజాగా పార్లమెంట్‌లో మోదీ...ఆంధ్రప్రదేశ్ విభజనపై కామెంట్స్ చేశారు..ఎలా పడితే అలా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టిందని, పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేసిందని, అందుకే ఏపీలో కాంగ్రెస్ గెలవడం లేదని, తెలంగాణలో కూడా ఆ పార్టీ మునిగిపోయిందన్నట్లు మోదీ చెప్పుకొచ్చారు.
అంటే విభజన సరిగ్గా చేయకపోవడం వల్లే కాంగ్రెస్ పరిస్తితి దిగజారిపోయిందనేది మోదీ ఉద్దేశం. అవును మోదీ ఉద్దేశం కరెక్ట్ అని చెప్పొచ్చు....కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేయలేదు...అందుకే ఏపీ బాగా నష్టపోయింది..అలాగే రాజకీయంగా కాంగ్రెస్ కూడా దెబ్బతింది. అయితే కాంగ్రెస్ విభజన మాత్రమే చేసింది...కానీ బీజేపీ ఏపీని నిలువునా ముంచేసింది..అందుకే ఏపీలో బీజేపీకి ఆదరణ లేదు. మరి ఆ విషయం మోదీకి తెలియకపోవడం కాస్త వింతే.
అసలు రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చి బీజేపీ...ఏపీకి చేసిన సాయం పెద్దగా లేదు...ఇంతవరకు విభజన హామీలు నెరవేర్చలేదు...ప్రత్యేక హోదా తీసేశారు..రైల్వే జోన్ లేదు..పోర్టులని గాలికొదిలేశారు. ఇలా అన్నిరకాలుగా బీజేపీ రాష్ట్రానికి అన్యాయమే చేసింది. ఆ విషయం గురించి కూడా మోదీ మాట్లాడితే బాగుండేది అని విశ్లేషకులు అంటున్నారు...ఏదో కాంగ్రెస్ మాత్రమే దోషి అన్నట్లు మోదీ స్పీచ్‌లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. బీజేపీ వల్ల ఏపీ ఇంకా నష్టపోయిందని అంటున్నారు.
అందుకే ఏపీలో బీజేపీకి ఆదరణ లేకుండా పోయింది...గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలిసిందే. అసలు ఆ పార్టీ ఒక్క శాతం ఓట్లు కూడా దాటలేదు. ఇప్పటికీ ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ పెద్దగా లేదు...అసలు ఆ పార్టీ ఒక్క శాతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే గ్రేట్ అని చెప్పొచ్చు. దేశంలో ఏమో గాని ఏపీలో మాత్రం కమలం అంటే ఫ్లవరే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: