కొత్త కొడాలి?

M N Amaleswara rao
అవును కొడాలి నాని కొత్తగా కనిపిస్తున్నారు...ఆయన రాజకీయం ఈ మధ్య మారినట్లు కనిపిస్తోంది..మరి ఈ మార్పులో కూడా ఏమన్నా స్ట్రాటజీ ఉందో లేక నిజంగా కొడాలిలో మార్పు వచ్చిందో మాత్రం విశ్లేషకులు క్లారిటీ రావడం లేదనే చెప్పాలి. అసలు కొడాలి నాని అంటే...ఎప్పుడు చంద్రబాబుని పచ్చి బూతులు తిడుతూ ఉండాలి....ఆయన మంత్రిగా ఏం పనిచేస్తున్నారో తెలియదు గాని..అసలు నాని కనిపిస్తే చాలు...బాబుని ఏం తిడతారని వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తాయి...అంటే నాని ఉన్నది బాబుని తిట్టడానికే అన్నట్లు పరిస్తితి వచ్చింది.

అలా ఎప్పుడు బాబుని తిట్టే నాని..ఆ మధ్య ఇంకా తిట్టను అని చెప్పిన విషయం తెలిసిందే...క్యాసినో వ్యవహారంలో రచ్చ అయినప్పుడు నాని..చంద్రబాబుని తెగ తిట్టేశారు..అదే స్థాయిలో కొడాలిని టీడీపీ నేతలు కూడా తిట్టారు. అయితే టీడీపీ నేత బుద్దా వెంకన్న, కొడాలి నానిలు ఒక ఒప్పందానికి వచ్చిన విషయం తెలిసిందే. తాము కొడాలి జోలికి వెళ్ళమని, కానీ బాబుని తిడితే మాత్రం ఊరుకోమని బుద్దా అన్నారు. అలాగే తన జోలికి రాకపోతే, తాను బాబుని తిట్టనని నాని అన్నారు.
ఇక అక్కడ నుంచి కొడాలి, బాబుని తిట్టడం లేదు...అప్పుడు మీడియాలో చంద్రబాబు గారు అని కూడా అన్నారు. అయితే అప్పటినుంచి కొడాలిలో రాజకీయంగా కూడా కొన్ని మార్పులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి...అసలు ఈ మధ్య కొడాలి మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు..ఏదో మొన్న జిల్లాల విభజన సమయంలో విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినప్పుడు స్పందించారు. అంతే మళ్ళీ కొడాలి మీడియా ముందు కనిపించడం లేదు.
అయితే ఈ మధ్య కొడాలి...గుడివాడలోనే ఎక్కువ ఉంటున్నారు...అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడానికి కొడాలి కృషి చేస్తున్నారు...మొన్నటివరకు అంటే స్థానిక వైసీపీ నేతల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకునేవారు..కానీ ఇటీవల కొడాలి డైరక్ట్‌గా ప్రజలని కలుసుకుంటున్నారు. మరి మొత్తానికి కొడాలి నాని కొత్తగా కనిపిస్తున్నారు..మరి ఈ మార్పు ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: