పుంగనూరు-మాచర్లలో తమ్ముళ్ళు తగ్గేలా లేరు!

M N Amaleswara rao
వైసీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని నియోజకవర్గాల పేర్లు బాగా వినిపించాయి...రాజకీయ పరంగా కొందరు నేతల ఆధిపత్యం మరీ ఎక్కువై...అక్కడ ప్రత్యర్ధులకు ప్లేస్ లేకుండా చేశారు. అలా ప్రత్యర్ధులకు స్థానం లేకుండా పోయిన నియోజకవర్గాల్లో మాచర్ల-పుంగనూరులు ముందు వరుసలో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రెండు నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలే..ఇంకా చెప్పాలంటే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాలు.
ఈ రెండు చోట్ల టీడీపీకి రాజకీయంగా స్థానం లేకుండా పోయింది...అసలు స్థానం లేకుండా చేశారు. ఇంకా తమకు రాజకీయంగా ఎదురు ఉండకూడదని చెప్పి, ప్రత్యర్ధులని ఎంటర్ అవ్వనివ్వలేదు. అసలు స్థానిక ఎన్నికల సమయంలో ఈ రెండు స్థానాలు ఏ స్థాయిలో హైలైట్ అయ్యేయో చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు చొట్లే వైసీపీకి అత్యధికంగా ఏకగ్రీవాలు అయ్యాయి. పంచాయితీ కావొచ్చు...పరిషత్ కావొచ్చు...మున్సిపాలిటీ కావొచ్చు వైసీపీకి ఎదురు నామినేషన్ వేసేవారే లేరు.
అలా అని ఆ రెండు చోట్ల టీడీపీ కార్యకర్తలు, మద్ధతు దారులు లేరని కాదు...ఆ రెండు చోట్ల ఉన్నారు కానీ...వారికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. పనిగట్టుకుని విజయవాడ నుంచి వెళ్ళిన బుద్దా వెంకన్న, బోండా ఉమాల పరిస్తితి ఏమైందో చెప్పాల్సిన పని లేదు. మాచర్లలో తమ అభ్యర్ధులతో నామినేషన్స్ వెయిద్దామని అనుకుంటే...వైసీపీ నేతల దాడిలో చిక్కుకున్నారు. అటు పుంగనూరులో ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేయాలనుకుంటే...వారి పత్రాలు చిరిగిపోయేవి. మరి ఆ స్థాయిలో పుంగనూరు-మాచర్లలో రాజకీయం నడిచింది.
అయితే అలాంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీ ఇంచార్జ్‌లు దూకుడుగా పనిచేస్తున్నారు...కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేలా వారు ముందుకెళుతున్నారు. పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డి, మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు దూకుడుగా వెళుతున్నారు. వీరిని చూసి టీడీపీ కార్యకర్తలు కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వైసీపీకి చెక్ పెట్టేయాలనే కసితో పనిచేస్తున్నారు. మరి వైసీపీ కంచుకోటలుగా ఉన్న మాచర్ల-పుంగనూరుల్లో టీడీపీ ఎంతవరకు రాణిస్తుందో..వైసీపీ కి ఏ మేర చెక్ పెట్టగలుగుతుందో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: