ఎలాన్ మస్క్ : అపరకుబేరునికి మళ్ళీ మైండ్ బ్లాకయ్యే షాక్ ?

Purushottham Vinay
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కి భారత ప్రభుత్వం మరోసారి దిమ్మతిరిగి మైండ్ బ్లాకయ్యే షాకిచ్చింది. టెస్లా స్పెస్ ఎక్స్ సీఈవో అయిన ఎలాన్ మస్క్ తన బిజినెస్ ని ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశపెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ కార్లను అమెరికాలో తయారు చేసి ఇండియాకి దిగుమతి చేయాలని ఆయన భావిస్తున్నారు. కానీ ఇండియాలో దిగుమతి చేసుకునే కార్లపై సుంకాల విషయంలో మాత్రం ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాజాగా దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు తగ్గించుకోవాలని ఎలాన్ మస్క్ ఇండియన్ గవర్నమెంట్ ని డిమాండ్ చేశాడు. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని మన ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పాక్షికంగా తయారు చేసిన కార్లను ఇక్కడికి తీసుకువచ్చి అసెంబ్లింగ్ చేస్తే వాటిపై తక్కువ పన్నులే విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

ఇక మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అసెంబ్లింగ్ తయారీ చేసే కంపెనీలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది.ఇండియాలో బిజినెస్ చేయాలంటే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని గతంలో ఎలాన్ మస్క్ ఓ సందర్భంలో కామెంట్స్ చేశాడు. ఇక మరోవైపు ఆయన మరో కంపెనీ స్పేస్ఎక్స్ నుంచి శాటిలైట్ సంబంధిత స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు అనేవి అందిస్తున్నారు. దీన్ని ఆసియాకు విస్తరించేందుకు భారత్ అయితే మంచిదని కంపెనీ భావించి ప్రయత్నాలు మొదలెట్టింది.ఇక సేవలు కంటే ముందు బుకింగ్స్ సైతం ప్రారంభించింది. కానీ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు చేయకూడదనే నిబంధనతో కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. దీంతో కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులను స్టార్లింక్ వెనక్కి ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇండియాలోనే తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ ఎలాన్ మస్క్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్తో సహా పంజాబ్ మహారాష్ట్ర కర్ణాటక బెంగాల్ మంత్రులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: