ఎస్మా ప్రయోగించటంపై జగన్‌ సంచలన నిర్ణయం ?

Veldandi Saikiran

అమరావతి :  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఎస్మా ప్రయోగించటానికి ఉన్న అవకాశాల పై కసరత్తు చేస్తుంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు  రెండు గంటలుగా కొనసాగుతోంది సమావేశం. సీఎం  జగన్‌ మోహన్‌ రెడ్డి తో పాటు గా భేటీ కొనసాగిస్తున్నారు మంత్రులు బుగ్గన, బొత్స, సలహాదారు సజ్జల. క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి బయలుదేరారు సీఎస్ సమీర్ శర్మ. జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశం అవనున్న సీఎస్..  సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సమీర్ శర్మ.  అత్యవసర సేవల నిర్వహణా చట్టం 1971 ప్రకారం ఎస్మా ప్రయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.  వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ స్టాఫ్, ప్రజా రవాణా, విద్యుత్, నీళ్ళ సప్లయ్, అంబులెన్స్ సర్వీసులు, మందుల తయారీ, రవాణా, ఆహార రంగం, బయో మెడికల్ వ్యార్ధాల నిర్వహణ వంటి సేవల అంశాల్లో ఎస్మా ప్రయోగించే అవకాశం స్పష్టం గా కనిపిస్తోంది.

 ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.  మరో వైపు సీపీఎస్ రద్దు, హెచ్ఆర్ఎ జీవోల్లో సవరణ  అంశం పై కసరత్తు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి. ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో కీలక సమావేశం నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగులు ఇవాళ  చేపట్టిన పెన్ డౌన్, యాప్స్ డౌన్ పై చర్చ జరుగుతోన్నట్లు సమాచారం అందుతోంది.  ఉద్యోగ సంఘాల డిమాండ్ల పై చర్చిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్   మోహన్‌ రెడ్డి. పీఆర్సీ సహా హెచ్ఆర్ఏ, ఇతర డిమాండ్ల పైనా చర్చ జరిగే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.  సోమవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్తే  తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. పాలన స్తంభించకుండా  తీసుకోవాల్సిన  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు సీఎం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: