టెస్లాకు షాక్.. కార్లు ఎదురు తిరిగాయ్?

praveen
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్నో రోబోలను తయారు చేస్తారు. ఈ రోబోలు మనుషులు చేయాల్సిన అన్ని పనులు చేస్తూ ఉంటాయి. కానీ  ఇలాంటి ప్రయోగం వికటించి ఏకంగా మనుషులనే శాసించాలనే ఉద్దేశంతోనే ఎన్నో దారుణాలకు పాల్పడుతుంది. ఇక ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.  అచ్చంగా ఇప్పుడు టెస్లా కార్ల విషయంలో ఇలాంటి జరుగుతుంది అని తెలుస్తోంది. ఎలక్ట్రికల్ కార్ల తయారీలో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతుంది టెస్లా.

 ఎప్పుడు ఎంతో నాణ్యమైన కార్లను తయారు చేస్తూ మార్కెట్ను కాపాడుకుంటూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ప్రపంచం మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి టెస్లా కార్లకు డిమాండ్ కూడా వచ్చింది. ఇలాంటి సమయంలోనే ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించిన టెస్లా ఏకంగా డ్రైవర్ లేకుండా నడిచే కార్లను తయారు చేసింది. కేవలం ఒక రూట్  మ్యాప్ తో డ్రైవర్ అవసరం లేకుండానే కార్ ముందుకు దూసుకుపోతూ ఉంటుంది. టెస్లా కనిపెట్టిన ఈ సరికొత్త  కార్ అద్భుతం అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.

 కానీ ఇప్పుడు మాత్రం ప్లాన్ రివర్స్ అయ్యింది  అని అర్థమవుతుంది. టెస్లా ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్లు ఇక ఇప్పుడు సాంకేతిక లోపం కారణంగా కస్టమర్లకు ఇబ్బందికరంగా మారిపోయాయ్. ఈ క్రమంలోనే ఏకంగా టెస్లా తయారుచేసిన 54వేల కార్లు మళ్ళీ వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది టెస్లా కంపెనీ. ఇది కాస్త ప్రస్తుతం సంచలనం గానే  మారిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్లతో తయారుచేసిన కార్ల అమ్మకాలు కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.  టెస్లా తయారు చేసిన డ్రైవింగ్ కార్లు రోడ్డు నిబంధనలు పాటించడం లేదు అంటూ అమెరికా కంప్లైంట్ ఇవ్వడం తో ఇక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: