యనమల ఫ్యామిలీలో వారసత్వ పోరు?

M N Amaleswara rao
యనమల రామకృష్ణుడు..ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు..ఈయన గురించి ప్రత్యేకంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు...ఏపీ ప్రజలకు యనమల బాగా తెలుసు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు. దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేస్తున్న యనమల...ఆ పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో చెప్పాల్సిన పని లేదు. బీసీ నాయకుడైన యనమల తూర్పు గోదావరిలో టీడీపీ బలంగా నిలబడటానికి కృషి చేశారు. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు.
మరి ఇంత సీనియారిటీ ఉన్న యనమలకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే పార్టీని నిలబెట్టుకోలేని పరిస్తితి వచ్చింది. యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన దగ్గర నుంచి...తన సొంత నియోజకవర్గం తునిలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది..దీనికి కారణం యనమల సోదరుడు కృష్ణుడు...గత రెండు ఎన్నికల్లోనూ తుని బరిలో కృష్ణుడు ఓడిపోతూ వస్తున్నారు. అసలు కృష్ణుడుని తుని ప్రజలు అంగీకరించడం లేదు...మరొకసారి ఆయన్ని నిలబెట్టినా సరే ఓడించేలా ఉన్నారు.

 
తుని ప్రజలే కాదు...టీడీపీ కార్యకర్తలే కృష్ణుడు నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు..అందుకే తుని సీటు విషయంలో చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. తుని సీటుని యనమల ఫ్యామిలీని దాటి బయట నేతకు ఇవ్వలేరు. అయితే యనమల రామకృష్ణుడు ఫ్యామిలీలో సీటు కోసం పోటీ గట్టిగా పెరిగింది. ఒకవేళ కృష్ణుడుకు సీటు ఇవ్వకపోతే...తన కుమార్తె దివ్యకు సీటు ఇవ్వాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేస్తున్నారట. అదే సమయంలో యనమల మరో సోదరుడు కుమారుడు రాజేష్‌కు సీటు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తుందట.
కానీ రాజేష్‌కు సీటు ఇవ్వడం యనమలకు ఇష్టం లేదని తెలుస్తోంది..తన కుమార్తెకే సీటు ఇవ్వాలని యనమల కోరుతున్నారట. దీంతో తుని సీటు ఎవరికి కేటాయించాలనే విషయంపై చంద్రబాబు ఒక క్లారిటీకి రాలేకపోతున్నారని తెలుస్తోంది. అయితే త్వరలోనే తుని నియోజకవర్గంపై సమీక్షా సమావేశం నిర్వహించి...ఇంచార్జ్‌ని తేల్చేయాలని బాబు డిసైడ్ అయ్యారట. మరి చూడాలి చివరికి తుని ఎవరికి దక్కుతుందో..యనమల రామకృష్ణుడు మాట నెగ్గుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: