చంద్రబాబుపై జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..

Purushottham Vinay
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. ఇంకా చెప్పాలంటే తమ పార్టీ అధినేత చంద్రబాబు గురించి తమకున్న ఫీలింగ్స్ను నిర్మొహమాటంగా ఆయన బయటపెట్టేశారు.అనంతపురం జిల్లా రాజకీయాల గురించి ఆయన స్పందిస్తూ.. ఇక ఆయన గెలిచిన సమయంలో కేవలం పరిటాల సునీత మాత్రమే ఫోన్ చేసి అభినందనలు తెలిపారు తప్ప ఇతర నేతలు ఎవ్వరూ కూడా తనతో మాట మాత్రమైన మాట్లాడలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఏంటో అర్థం అవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతల రాజకీయాల గురించి ఎవరికి కూడా తెలియదని ఆయన నర్మగర్భ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే తన గుండె మండిపోతోందని చంద్రబాబు నాయుడు ఇక సీఎం సీటు ఎక్కినప్పుడు మాత్రమే తన ఆవేశం తగ్గిపోతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
తన రాజకీయంపై తమ పార్టీకి చెందిన వారు కూడా అనుమానాలు వ్యక్తం చేయడం అనేది చాలా చిత్రంగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పదవి పొందిన నాయకుడి వద్దకు ఆయనే వెళ్లి పార్టీ బలోపేతం కోసం ఏం చేసేందుకైనా రెడీ అని తాను చెప్పానని అయినప్పటికీ వారి వైపు నుంచి స్పందన లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ చేశారు. తమ పరిస్థితి గురించి కూడా ఒక్కోసారి గందరగోళం ఏర్పడుతోందని ఆయన వాపోయారు. తాను ఇందిరాగాంధీ ధైర్యానికి తమకు అండగా నిలిచిన సంజీవరెడ్డి గొప్ప మనసుకు తాను ఎదిగిన తీరు పట్ల చంద్రబాబు నాయుడును చూసి తమపై ప్రేమాభిమానాలు కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానిస్తానని ఆయన తెలిపారు. అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం విషయంలో తామెప్పుడూ కూడా కన్ఫ్యూజన్లో లేమని జేసీ తెలిపారు. తాము చేయాలనుకున్నది చేస్తామని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం ఆయన లేదన్నారు. స్థానిక రాజకీయాల గురించి తమ నాయకుడికి ఏం చెప్తున్నారో ఏంటో అసలు అర్థం కావడం లేదని పరోక్షంగా తమ అసంతృప్తిని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: