కొడాలి తగ్గేదేలే...అన్నీ బయటపెట్టేస్తారంటా!

M N Amaleswara rao
ఏపీలో కొడాలి నాని, టీడీపీ నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది..కొడాలి నాని గుడివాడలో క్యాసినో నడిపించారంటూ తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కొడాలి ఆధ్వర్యంలోనే ఈ క్యాసినో వ్యవహారం నడిచిందని చెప్పి, క్యాసినోకు సంబంధించిన పలు ఫోటోలని, వీడియోలని సోషల్ మీడియా, మీడియాలో వదిలిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ కరోనాకు చికిత్స పొంది, ఏపీ వచ్చిన వెంటనే...కొడాలి దీనిపై తీవ్రంగా స్పందించారు. అసలు క్యాసినోతో తనకు సంబంధం లేదని, ఉందని నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని, కావాలంటే పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంటానని సవాల్ చేశారు.
దీనికి టీడీపీ నుంచి గట్టిగానే కౌంటర్లు వచ్చాయి...నిరూపించలేకపోతే తాము పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటామని, లేదంటే కొడాలి తగలబెట్టుకోవాలని అన్నారు. అలాగే నిజనిర్ధారణ కమిటీ అంటూ టీడీపీ నేతలు హడావిడి చేశారు. మళ్ళీ ఆ వెంటనే టీడీపీ నేతలకు కొడాలి స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇచ్చేశారు.  అసలు చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని కొడాలి దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
కొడాలి మాటలకు తమ్ముళ్ళు కౌంటర్లు ఇవ్వకుండా ఉండరుగా...ఆ వెంటనే బాబు భక్తుడు బుద్దా వెంకన్న లైన్‌లోకి వచ్చి...చంద్రబాబు గేటు దాటి వెళితే...కొడాలి శవమై వెళ్తారని నోరు జారారు...మన రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఏం మాట్లాడినా పర్లేదు గాని...ఇలా ప్రతిపక్ష నేతలు నోరు జారితే వెంటనే జైలు పాలవ్వడం గ్యారెంటీ...అలాగే బుద్దాని పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే బెయిల్ మీద బయటకు రావడం జరిగాయి.
అయినా సరే కొడాలి మాటల యుద్ధం ఆపలేదు...వారు ఆపే వరకు తాను ఆపనని, ఒకటే అంటే వంద అంటానని అన్నట్లు నాని ఉన్నారు. అలాగే గతంలో చంద్రబాబు ఖైరతాబాద్‌లోని టీడీపీ ఆఫీసులో పేకాట నిర్వహించారని, అప్పుడు ఎన్టీఆర్ చెప్పుతో కొట్టారని, ఈ విషయం తనకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే చెప్పారని నాని సెలవిచ్చారు. అలాగే గతంలో చంద్రబాబు వల్ల ఇబ్బందులు పడిన వారు...ఒక్కొరిగా బయటకు వస్తున్నారని, వారి చేత కేసులు పెట్టించి బడిత పూజా చేయిస్తామని నాని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. అంటే తన గురించి ఏమన్నా బయటపెడితే...మీ గురించి కూడా బయటపెడతా అన్నట్లు నాని టీడీపీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: