అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ, అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామ కృష్ణుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు పోలీసుల దౌర్జన్యం తోడయిందని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు యనమల రామ కృష్ణుడు.. టీడీపి పార్టీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు యనమల రామ కృష్ణుడు. సమాజంలో అల్లర్లు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న వైసీపీ పార్టీ గుండాలను వదలి టీడీపీ పార్టీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని నిప్పులు చెరిగారు యనమల రామ కృష్ణుడు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండని సంచలన వ్యాఖ్యలు చేశారు యనమల రామ కృష్ణుడు.
వైసీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు కొడాలి నాని.. కొంత మంది వైసీపీ పార్టీ నేతలు టీడీపీ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా, సభ్య సమాజం తలదించుకునేలా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ? అని నిప్పులు చెరిగారు యనమల రామ కృష్ణుడు. వారి పై ఏం చర్యలు తీసుకున్నారు? 3 ఏళ్లలో ఎంతమంది వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసారు ? అని ఆగ్రహించారు యనమల రామ కృష్ణుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు విని డిజిపి, డి. జి. పి చెప్పినట్టు విని కొంతమంది పోలీసులు వారి భవిష్యత్ ను వారే అంధకారం లోకి నెట్టుకుంటున్నారని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు యనమల రామ కృష్ణుడు.. తక్షణమే బుద్దా వెంకన్నను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు యనమల రామ కృష్ణుడు..